Sana|కుడి వైపున నొప్పి.. అయిన నా భ‌ర్తకి హార్ట్ స‌ర్జ‌రీ.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన స‌న‌

Sana| అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో షానూర్ సన ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాలు చే

  • Publish Date - April 20, 2024 / 09:55 AM IST

Sana| అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో షానూర్ సన ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎప్పుడు పెద్ద‌గా చెప్పుకోదు. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పటివరకు దాదాపు 600 పైగా సినిమాలలో అనేక సీరియల్స్ లో కూడా నటించారు. సన మొదట మోడల్ గా ప్రయత్నం చేసి హీరోయిన్ గా అవ్వాల‌ని భావించింది. కాని ఆమెకి స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డం వ‌ల‌న సీరియ‌ల్స్ చేసింది. ఇక నిన్నే పెళ్లాడతా సినిమా ద్వారా సహా నటిగా కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది.

ఇటీవ‌ల త‌న భ‌ర్త‌కి గుండెపోటు రావ‌డంతో స‌నా చాలా ఎమోష‌న‌ల్ అయింది.అప్పుడు ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల గురించి మాట్లాడుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయింది. తన భర్తకి ఎదురైన రియల్ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకుంటూ అంద‌రిని అల‌ర్ట్ కూడా చేసింది. గ‌త కొన్నాళ్ళుగా నేను సంతోషంగా లేను. అందుకు కార‌ణం మా వారికి ఆరోగ్యం ఏమి బాగోలేదు. ఇటీవ‌ల ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే మేజర్ స్టంట్ వేశారు. దేవుడి ద‌య వ‌ల‌న అంతా మంచిగానే జ‌రిగింది. అయితే చాలా మందికి నొప్పి లెఫ్ట్ సైడ్ వ‌స్తుందని అనుకుంటాం. కాని మా వారికి రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ నొప్పి అనేసరికి మేమంతా గ్యాస్ నొప్పి అనుకున్నాం.. కానీ హాస్పిటల్‌కి వెళ్లిన తరువాత అసలు విషయం బ‌య‌ట‌ప‌డింది అని స‌న చెప్పుకొచ్చింది.

మా వారికి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి ఏమీ లేవు. అసలు ఆయనకి ఎప్పుడూ ఫీవర్ వచ్చింది కూడా లేదు. ఆయన హాస్పిటల్‌కి వెళ్దాం అనేసరికి చాలా భ‌యం వేసింది. ఈసీజీ తీసాక హార్ట్ ఎటాక్ అని తెలిసింది. ఇలాంటిది చాలా డేంజ‌ర‌ట‌. చూడ్డానికి మనిషి బాగానే మాట్లాడుతుంటారు కానీ.. సడెన్‌గా ఎటాక్ అవుతుందని చెప్తారు. ఇక ఆయ‌న‌క బీపీ 190 నుండి త‌గ్గ‌డం లేదు. అయితే ఆసుప‌త్రికి వెళ్లాక మేజ‌ర్ బ్లాక్ కి స్టంట్ వేశారు. హార్ట్‌కి బ్లడ్ సర్య్యులేషన్ అయ్యే పార్ట్.. కుడిభాగంలో బ్లాక్ కావడంతో ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు డాక్టర్లు. హార్ట్ ఎటాక్ అంటే.. హార్ట్‌కి ఉన్న భాగం దగ్గరే కాదు.. గెడ్డానికి కింది భాగంగా నుంచి గుండెల వరకూ ఎక్కడైనా ఎటువైపునైనా నొప్పి రావొచ్చ‌ని నాకు డాక్టర్స్ తెలియ‌జేశారు. ఇలాంటివి రేర్ కేసులు అట. ప్ర‌స్తుతానికి ఆయ‌న బాగానే ఉన్నారు. కోలుకోవ‌డానికి ఇంకాస్త టైం ప‌డుతుంద‌ని ఆమె చెప్పుకొచ్చింది.

Latest News