Shruti Hassan| శాంత‌నుతో బ్రేక‌ప్ క‌న్‌ఫాం చేసిన శృతి హాసన్.. మ‌రో వ్య‌క్తితో మింగిల్‌..!

Shruti Hassan| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ఈ భామ ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కెరీర్ ప‌రంగా దూసుకెళుతున్న

  • Publish Date - May 24, 2024 / 09:54 AM IST

Shruti Hassan| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ఈ భామ ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కెరీర్ ప‌రంగా దూసుకెళుతున్న ఈ భామ బ్రేక‌ప్స్‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. ముందుగా ధ‌నుష్‌తో శృతి హాసన్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని, అయితే ధ‌నుష్ భార్య ఫైర్ కావ‌డంతో వారి రిలేష‌న్ బ్రేక‌ప్ అయింద‌ని ఓ టాక్. ఇక ధ‌నుష్‌తో బ్రేక‌ప్ అయ్యాక లండ‌న్‌కి చెందిన మైఖేల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణం న‌డిపింది. కొన్నేళ్ల పాటు ఈ ఇద్ద‌రు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన వీరిద్ద‌రు జంటగా కనిపించడం.. ఒక‌సారి క‌మ‌ల్ హాస‌న్‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకు వ‌చ్చి ప‌రిచ‌యం చేయ‌డం కూడా మ‌నం చూశాం.

ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారు అనుకున్న స‌మ‌యంలో అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది శృతి హాస‌న్. ఆ స‌మ‌యంలో చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లింది. మందుకు, డ్రగ్స్ కు బానిసగా మారి సినిమాలు కూడా పక్క‌న పెట్టేసేంది. అయితే మెల్లిగా ఆ బ్రేక‌ప్ బాధ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన శృతి హాస‌న్.. శాంతను హజారిక అనే డూడుల్ ఆర్టిస్ట్‌తో ప్రేమ‌లో ప‌డింది. అత‌నితో సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ర‌చ్చ మాములుగా లేదు. తమిళ్ పండగలకు శంతను హజారిక తమిళ్ తంబీల రెడీ అవ్వడం, ఇద్దరూ కలిసి పూజలు చేయడం, లైవ్‌లో ఇద్దరు క‌లిసి నానా ర‌చ్చ చేయ‌డం, అబ్బో చాలానే చేశారు

శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే శృతి కొన్నాళ్లుగా సైలెంట్ ఉంటుంది. దీంతో అనుమానం వ‌చ్చి వారి రిలేష‌న్ గురించి ఆరాలు తీయ‌గా, బ్రేకప్ అయినట్టు తేలింది. శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోలను డిలీట్ చేయ‌డంతో పాటు అతడిని అన్ ఫాలో అవుతోంది. అతడు కూడా శృతిని అన్ ఫాలో అయ్యాడు. దీంతో అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే తాజ‌గా శృతి హాస‌న్ ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించ‌గా, ఓ నెటిజ‌న్ ‘సింగిల్ ఆర్ కమిటెడ్’ అని అడిగాడు. అప్పుడు శృతి హాసన్ ”నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు నేను సింగిల్. మింగిల్ అవ్వటానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ వర్కింగ్, ఎంజాయింగ్ మై లైఫ్. బై! అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శృతి లైఫ్‌లో మూడో బ్రేక‌ప్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News