Site icon vidhaatha

Shubman Gill | శుభ్‌ మన్ చాలా క్యూట్‌గా ఉంటాడన్న హీరోయిన్… డిసెంబ‌ర్‌లో అత‌నితో పెళ్లా..!

Shubman Gill| టీమిండియా యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్ టీమిండియాలో త‌న స్థానం ప‌దిల‌ప‌ర‌చుకునేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక‌ప్పుడు ప‌రుగుల వ‌ర‌ద పారించిన గిల్ ఈ మ‌ధ్య అంత‌గా రాణించ‌లేక‌పోతున్నాడు. జింబాబ్వే సిరీస్ స‌మ‌యంలో కూడా గిల్ నుండి మంచి ఇన్నింగ్స్ రాలేదు. కాక‌పోతే కెప్టెన్‌గా అద్భుతంగా వ్య‌వ‌హ‌రించి టీమిండియా ఖాతాలో మ‌రో ట్రోఫీ చేరేలా చేశాడు. అయితే గిల్ ప్రేమాయ‌ణంపై లెక్క‌లేన‌న్ని రూమ‌ర్స్ వ‌స్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్ప‌టి నుండో ప్ర‌చారం జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో వారిద్ద‌రు ఒకరి పోస్టులకు ఒకరు లైక్ లు కొట్టడం, కామెంట్స్ చేసుకోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని పలువురు కామెంట్ చేస్తూ ఉన్నారు.

స‌చిన్ కూతురు త‌ర్వాత సారా అలీఖాన్‌తో శుభ్‌మ‌న్ ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. వారి రిలేషన్‌పై కూడా క్లారిటీ రాలేదు. ఇక తాజాగా బాలీవుడ్ అందాల తార రిద్దిమా పండిట్.. గిల్‌తో ప్రేమ‌లో ఉంద‌ని, వారిద్ద‌రు కూడా డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నార‌ ని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై గిల్ స్పందించడం లేదు కానీ రిద్దిమా పండిట్ తాజాగా స్పందిస్తూ.. గిల్ తో తన పెళ్లి అంటూ వస్తోన్న వార్తలను కొట్టి పారేసింది. ‘శుభ్ మన్ గిల్ అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని మాత్రమే తెలుసు. అంతే తప్ప అతను ఎవ‌రో నాకు తెలియ‌దు. మా మధ్య ఎలాంటి బంధం లేదు. అత‌డిని కలిసినప్పుడు మాత్రం ఈ విష‌యాల గురించి మాట్లాడుకొని న‌వ్వుకుంటాం.

అయితే శుభ్ మన్ గిల్ చాలా క్యూట్ ఉన్నాడు. కానీ ప్రేమ, పెళ్లి వంటివి మా మధ్య లేవు అని రిద్ధిమా చెప్పుకొచ్చింది. మరోవైపు శుభ్‌మన్ మాత్రం ఈ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకూ ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. సారా టెండూల్క‌ర్ ప్రేమాయ‌ణంకి సంబంధించి కూడా జోరుగా ప్ర‌చారాలు జ‌రిగిన‌, గిల్ ఏ మాత్రం స్పందించ‌లేదు. ఇక సారా అలీ ఖాన్ తో ప్రేమ పుకార్లు వ‌చ్చిన వాటిపై గిల్ నోరు విప్ప‌లేదు. మ‌రి ఇప్పుడు రిద్దిమా విష‌యంలోను స్పందించ‌క‌పోవ‌చ్చు అని తెలుస్తుంది. గిల్ ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా కెరీర్‌పైనే పెట్టాడు.

Exit mobile version