Sirish bharadwaj| శిరీష్ భ‌ర‌ద్వాజ్ మృతిపై స్పందించిన ఆయన త‌ల్లి.. తాగుడికి బానిసై చ‌నిపోయాడా..!

Sirish bharadwaj| చిరంజీవి మాజీ అల్లుడు,శ్రీజ మాజీ భ‌ర్త‌ శిరీష్ భ‌ర‌ద్వాజ్ కొద్ది రోజుల క్రితం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే శ్రీజ‌, శిరీష్ దంప‌తుల‌కి ని

  • Publish Date - July 3, 2024 / 12:35 PM IST

Sirish bharadwaj| చిరంజీవి మాజీ అల్లుడు,శ్రీజ మాజీ భ‌ర్త‌ శిరీష్ భ‌ర‌ద్వాజ్ కొద్ది రోజుల క్రితం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే శ్రీజ‌, శిరీష్ దంప‌తుల‌కి నివృతి అనే కూతురు జ‌న్మించ‌గా,కొడుకు కూడా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఓ మహిళా సామాజికవేత్త యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో శిరీష్‌కి కొడుకు కూడా ఉన్నాడనే ఆరోపణలు చేయ‌గా, దానిపై శిరీష్ త‌ల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్పందించింది. శిరీష్‌కి కొడుకు ఉన్నాడ‌నేది అవాస్త‌వం. లేని కొడుకు ఎక్క‌డ నుండి వ‌స్తారు. లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తూ శిరీష్‌పై, మా ఫ్యామిలీపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయోద్దు అని కోరింది శిరీష్ త‌ల్లి.

ఇక శిరీష్‌కి రెండో పెళ్లి ఇష్టం లేదని, కానీ తన బలవంతంతోనే మ్యారేజ్‌ చేసుకున్నారని శిరీష్ త‌ల్లి పేర్కొంది. అయితే పెళ్లి త‌ర్వాత రెండో భార్య‌తో బంధం స‌రిగ్గా న‌డ‌వ‌క విడాకులు తీసుకున్నార‌ని, విడాకుల‌కి సంబంధించి రెండో భార్య కేసు వేయాలనుకుంద‌ని, త‌ర్వాత విర‌మించుకున్న‌ట్టు తెలియ‌జేసింది. అయితే పెళ్లిళ్లు విఫలం కావడంతో చాలా బాధపడ్డాడని, డిస్టర్బ్ అయ్యాడని ఆ క్ర‌మంలోనే క‌న్న‌మూసాడ‌ని పేర్కొంది. అయితే తాగుడికి బానిసైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అవ‌న్నీ అవాస్త‌వాలు అని ఖండించింది. అంద‌రిలా మాములుగా తాగేవాడు త‌ప్ప ఎక్కువ‌గా తాగేవాడు కాదు.

తాగ‌డం వ‌ల‌న లివ‌ర్ పాడై చ‌నిపోయాడ‌ని వార్త‌లు వ‌చ్చిన‌వి అవాస్త‌వం. నెల రోజులకు ముందే అనారోగ్యంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు.ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గుండెపోటు వచ్చిందని శిరీష్ త‌ల్లి పేర్కొంది. శిరీష్‌కి మోడీ నుంచి, కిషన్‌ రెడ్డి వరకు అందరితోనూ పరిచయాలున్నాయి. వాటి ద్వారా చాలా మందికి హెల్ప్ చేశాడ‌ని కూడా చెప్పుకొచ్చింది. అయితే శిరీష్‌ని వాడుకున్న వాళ్లు ఎవ‌రు కూడా చ‌నిపోయిన స‌మ‌యంలో క‌నిపించ‌లేదు. నా కొడుకు చ‌నిపోయిన‌ప్పుడు కిషన్‌రెడ్డి వంటి వారు ఫోన్‌లో మాట్లాడారని,వాళ్లు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నార‌ని పేర్కొంది.

Latest News