Sirish Bharadwaj| చివ‌రి రోజుల‌లో కూతురిని చూడాల‌ని ఉంద‌న్నా పంప‌లేదు.. మెగా ఫ్యామిలీపై శిరీష్ త‌ల్లి షాకింగ్ కామెంట్స్

Sirish Bharadwaj| మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు గ‌తంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఆ స‌మ‌యంలో చిరంజీవి మౌనంగా ఉం

  • Publish Date - July 4, 2024 / 06:43 PM IST

Sirish Bharadwaj| మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు గ‌తంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఆ స‌మ‌యంలో చిరంజీవి మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజుల త‌ర్వాత శిరీష్ తో శ్రీజ‌కి విబేధాలు రావ‌డంతో తిరిగి మళ్లీ చిరంజీవి వ‌ద్ద‌కు వ‌చ్చేసింది. ఇక ఆమె క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌డం, అత‌నితో విడిపోవ‌డం జ‌రిగింది. ఇక శిరీష్ భ‌ర‌ద్వాజ్ కూడా రెండో పెళ్లి చేసుకోగా, అత‌ను కూడా బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే ఇటీవ‌ల శిరీష్ భ‌ర‌ద్వాజ్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందాడు.

దుబాయ్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ఆరోగ్యం పాడైందని శిరీష్ తల్లి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పింది. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని, నెలరోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడని, కార్డియాక్ అరెస్ట్ హఠాత్తుగా జరగడంతో మరణించినట్లు శిరీష్ తల్లి చెప్పుకొచ్చింది. త‌న కొడుకుపైన అనేక త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నార‌ని అవ‌న్నీ అవాస్త‌వాల‌ని కూడా తెలియ‌జేసింది. శిరీష్ కు తన కూతురు నివృత్తి అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ పాప శ్రీజ దగ్గరే ఉండ‌డంతో పాప‌ని చూపించ‌మ‌ని చాలా సార్లు అడిగిన‌ప్ప‌టికీ చిరంజీవి కుటుంబ స‌భ్యులు ఎవ‌రు చూపించ‌లేదు. శిరీష్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కూతురుని చూడాలనిపిస్తుందని అడిగాడట. పాపని పంపించమని తెలిసిన వాళ్ల ద్వారా శ్రీజ, మెగా ఫ్యామిలీని అడిగించాము.

కాని వాళ్లు ఏ మాత్రం పంప‌లేదంటూ శిరీష్ త‌ల్లి స్ప‌ష్టం చేసింది. ఆ స‌మ‌యంలో నా కొడుకు చాలా బాధ‌ప‌డ్డాడు. ఏ తండ్రి అయిన త‌న కూతురిని దూరం చేసుకోవాల‌ని అస్స‌లు అనుకోడు. నివృత్తి మా వంశం, మా పాప‌, నా మొదటి మనవరాలు, ఆమెని చూడాలని నాకూ ఉంటుంది. కానీ పంపించడం లేదని, పెద్ద వాళ్లు కదా అంటూ పేర్కొంది. అయితే ఒక‌వేళ ఆ పాప‌ని కలిస్తే, పాపతో మాట్లాడాల్సి వస్తే ఏం చెబుతారని అడగ్గా, మీ నాన్నగారు ఇది, నేను నానమ్మని, ఇది మన ఫ్యామిలీ` అని చెబుతా అని తెలిపింది శిరీష్‌ తల్లి. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Latest News