Sruthi Hassan| ఇండ్లీ-సాంబార్ విష‌యంలో శృతి హాస‌న్ ఫైర్.. తాట‌తీస్తానంటూ కామెంట్

Sruthi Hassan| శృతి హాస‌న్‌కి ల‌వ్ క‌లిసి రావ‌డం లేదు. గ‌తంలో చాలా మంది స్టార్స్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ భామ వాటిని సీక్రెట్‌గా ఉంచింది. అయితే లండ‌న్‌కి చెందిన వ్య‌క్తితో చాలా రోజుల పాటు స‌హ‌జీవ‌నం చేయ‌గా, అత‌ని విష‌యంలో ఎలాంటి దాప‌రికాలు మెయింటైన్ చేయ‌లేదు. అత‌నితో ప‌బ్లిక్‌గానే తిరి

  • Publish Date - June 22, 2024 / 07:15 AM IST

Sruthi Hassan| శృతి హాస‌న్‌కి ల‌వ్ క‌లిసి రావ‌డం లేదు. గ‌తంలో చాలా మంది స్టార్స్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ భామ వాటిని సీక్రెట్‌గా ఉంచింది. అయితే లండ‌న్‌కి చెందిన వ్య‌క్తితో చాలా రోజుల పాటు స‌హ‌జీవ‌నం చేయ‌గా, అత‌ని విష‌యంలో ఎలాంటి దాప‌రికాలు మెయింటైన్ చేయ‌లేదు. అత‌నితో ప‌బ్లిక్‌గానే తిరిగింది. అయితే కొన్నాళ్ల‌కి ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడిపోయారు. ఇక శాంత‌ను అనే డూడుల్ ఆర్టిస్ట్‌తో స‌హ‌జీవ‌నం చేసింది. అత‌నితో కూడా ఇటీవ‌ల బ్రేక‌ప్ చెప్పింది. … ఇప్పుడు శృతి హాసన్ సింగిల్. ఆమె జీవితంలో ప్రేమికుడు ఎవరూ లేరు. ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటున్న శృతి హాస‌న్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది.

తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్.. ఓ నెటిజ‌న్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. శృతి హాసన్‌ను ఓ నెటిజన్ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని అడగ‌గా, దానికి స్పందించిన శృతి హాస‌న్..ఓకే ఈ రకమైన జాతి వివక్షను ఏ మాత్రం సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే ఊరుకునేదే లేదు. ఎవ‌రు కూడా మమ్మ‌ల్ని అనుక‌రించ‌లేరు. మా మాదిరిగా ఉండాల‌ని అస్స‌లు ట్రై చేయకండి. ఎలా ప‌డితే అలా పిలిస్తే దానిని ఏ మాత్రం కామెడీగా తీసుకోము . స‌రే సౌత్ ఇండియ‌న్ భాష‌లో ఏదైన చెప్ప‌మ‌ని అడిగావు కాబట్టి నోరు మూసుకొని వెళ్లు అంటూ శృతి హాస‌న్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది.

శృతి హాస‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం శృతి హాసన్ చేతిలో ‘సలార్ 2’, అడివి శేష్ ‘డెకాయిట్’, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలి’తో పాటు ఓ హిందీ సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఆవిడ దృష్టి అంతా సినిమాలపై ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో బిజీ కావాలని ఈ అమ్మ‌డు భావిస్తుంది.

Latest News