Sruthi Hassan| శృతి హాస‌న్ ల‌వ‌ర్స్‌ని మార్చ‌డం వెన‌క ఉన్న కార‌ణం ఇదా..!

Sruthi Hassan| క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో తొలి విజ‌యాన్ని అందుకున్న శృతి హాస‌న్ ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసింది లేదు.తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. అయితే సౌత్‌లో స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్ సాగుతున్న స‌మ‌యంలో ఈ భామ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ అమ్మ‌డి కెరీర్ గాడి త‌ప్పింది. అయితే వ‌రుస సినిమా

  • Publish Date - June 30, 2024 / 09:46 AM IST

Sruthi Hassan| క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో తొలి విజ‌యాన్ని అందుకున్న శృతి హాస‌న్ ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసింది లేదు.తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. అయితే సౌత్‌లో స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్ సాగుతున్న స‌మ‌యంలో ఈ భామ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ అమ్మ‌డి కెరీర్ గాడి త‌ప్పింది. అయితే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మ‌యంలో శృతి హాస‌న్ మైఖేల్ కొర్స‌లే అనే విదేశీ వ్య‌క్తితో ప్రేమాయ‌ణం సాగింది. చాలా రోజుల పాటు అత‌నితో డేటింగ్‌లో ఉంది. అత‌ని కోసం సినిమాలు కూడా వ‌దిలేసింది. అయితే ఏం జ‌రిగిందో ఏమో కాని వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది.

ఇక మైఖేల్‌తో బ్రేక‌ప్ చెప్పాక శృతి హాస‌న్.. ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో మూడేళ్లకు పైగా సహజీవనం చేసింది. ఇద్ద‌రు క‌లిసి ఒకే ఇంట్లో ఉంటూ తెగ ర‌చ్చ చేసేవారు. ఎక్క‌డికి వెళ్లిన క‌లిసి వెళ్ల‌డం, అత‌నితో గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం వంటివి శృతి హాస‌న్ చేసింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే శాంతను-శృతి హాసన్ అనుకోని కార‌ణాల వ‌ల‌న విడిపోయారు. శాంత‌నుతో విడిపోయాక శృతి హాస‌న్ సింగిల్ స్టేట‌స్ మెయింటైన్ చేస్తుంది. అయితే శృతి హాస‌న్ గతంలో ప‌లువురు హీరోల‌తో కూడా ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు ప్ర‌చారాలు సాగాయి. దీనిపై క్లారిటీ లేదు.

అయితే శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పడానికి ఇదే ప్రధాన కారణం అంటూ నెట్టింట ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. శృతి హాస‌న్‌కి వివాహం అంటే ఇష్టం ఉందట. చెప్పాలంటే భయం అట. ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పెళ్లి అంటే భ‌యం అని స్వ‌యంగా చెప్పింది. అయితే ఆ భయానికే శృతి హాస‌న్ త‌న బాయ్ ఫ్రెండ్స్‌ని మారుస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. కొంత కాలం సహజీనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చక‌పోవ‌డంతోనే ఆమె బ్రేక‌ప్ చెప్పేస్తుంద‌ని ఇండ‌స్ట్రీ టాక్. శాంత‌నుతో శృతి బ్రేకప్ చెప్ప‌డానికి కూడా కార‌ణం ఇదే అని అంటున్నారు.

Latest News