SSMB29 : రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబీ 29నుంచి ఫస్ట్ అప్డేట్ రిలీజ్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఫస్ట్ అప్డేట్ రిలీజ్. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ బయటకు విడుదల చేశారు.

SSMB29

విధాత : మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది.
SSMB29 ఫస్ట్‌ అప్‌డేట్‌ గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లుక్‌ ను రాజమౌళి విడుదల చేశారు. ఫస్ట్ అప్డేట్ విడుదల సందర్భంగా రాజమౌళి స్పందిస్తూ..పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి.. మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను అని వెల్లడించారు. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి.. కుంభ పాత్రకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉందన్నారు.
తన కుర్చీ(పాత్ర)లో ఒదిగిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు అని రాజమౌళి పేర్కొన్నారు.

ఇకపోతే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి నవంబర్ 15న ఒక ప్రత్యేక “గ్లోబల్ ట్రోటర్” ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్న ఈ వేడుకలో సినిమాలో మహేశ్ బాబుకు సంబంధించిన అప్డేట్ ను రాజమౌళి విడుదల చేయబోతుండటం విశేషం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంఛర్, యాక్షన్ మూవీగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రాబోతుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.