Jatadhara Trailer : గుస్ బంప్స్ తెప్పించిన ‘జటాధర’ సెకండ్ ట్రైలర్

సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సెకండ్ ట్రైలర్ విడుదల. ధన పిశాచి థ్రిల్లర్ విజువల్ వండర్‌గా ప్రేక్షకులలో ఆసక్తి రేపింది.

Jatadhara Second Trailer

విధాత : సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘జటాధర’ మూవీ ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్ ..బుధవారం మరో ట్రైలర్ విడుదల చేశారు. వెంకట్‌ కల్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ యాక్షన్‌ అడ్వెంచర్‌, హర్రర్ ఫాంటసీ మూవీగా తెరకెక్కించారు. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు.

జీ స్టూడియోస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘జటాధర’ అనంత పద్మనాభ స్వామి ఆలయం స్పూర్తితో కథనం సాగుతూ ధన పిశాచి దుశ్చర్యలు, దానిని ఎదుర్కొనేందుకు హీరో సాహసాలు ట్రైలర్ లో కనిపించాయి. ఆ బ్రహ్మదేవుడి సృష్టిలో చీకటి కోణం ధన పిశాచి అన్న డైలాగ్ ..బలి సరిపోలేదురా అంటూ ధన పిశాచి దాడికి దిగడం వంటి సన్నివేశాలు విజువల్ వండర్ గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక అంశాలు, హర్రర్ సంఘటనలకు కుటుంబ భావోద్వేగాలను మిక్స్ చేసి రూపొందించిన సినిమా ఆసక్తికరంగా ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. మొత్తంగా మూవీ నుంచి వచ్చిన సెకండ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది.