‘Trend Set Chey Pilloda’ Song From Jatadhara | జటధరా నుంచి ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా సాంగ్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర' నుంచి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఫుల్ జోష్‌లో ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Trend Set Chey Pilloda Song From Jatadhara

విధాత : సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న‘జటాధర’ సినిమా నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’సినిమాలో మరో బాలీవుడ్ స్టార్స్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఎన్నాళ్లింకా..కిస్ క్యాచ్ పట్టరా..చాలు ఇంకా సింగిల్ లైఫ్..మింగిలవుదాం పదరా.. ..ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా.. అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ మణి అందించిన లిరిక్స్ ను రాయీస్, జైన్ – సామ్ కంపోజ్ చేశారు. సింగర్స్ స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ ఆలపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఫుల్ జోష్ లో ఉన్న సాంగ్.. అందరినీ ఆకట్టుకుని నెట్టింట దూసుకుపోతోంది.