Sambarala Yeti Gattu Glimpse : సంబరాల ఏటిగట్టు.. రాక్షసుల ఆగమనం గ్లింప్స్

సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న 'ఎస్‌.వై.జి' (సంబరాల ఏటిగట్టు) చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. 'రాక్షసుల ఆగమనం' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రగ్గడ్ లుక్‌లో సాయి తేజ్ నటించారు. మైథలాజికల్ టచ్, మాస్ యాక్షన్ అంశాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

sai-durga-tej-sambarala-yeti-gattu-first-glimpses-release

విధాత: సాయుదుర్గా తేజ్ హీరోగా రోహిత్.కే.పీ. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్‌.వై.జి’ (సంబరాల ఏటిగట్టు) సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. సాయిదుర్గా పుట్టిన రోజు పురస్కరించుకుని సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం..’ అంటూ సాయి దుర్గాతేజ్‌ కత్తి పట్టుకుని పవర్‌ఫుల్‌ డైలాగుతో గర్జిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్తం బంధం’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో… భూమి కోసం అందులో దొరికే ఖనిజాల కోసం పోరాటంలా అనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, మైథలాజికల్ టచ్, మాస్, యాక్షన్ అంశాలు అన్నీ కలిపి మూవీని తెరకెక్కించినట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది. కొంచెం కేజీఎఫ్ సినిమా ఛాయలు కనిపించాయి. సాయి తేజ్ కొత్త లుక్స్ అదిరిపోయింది.

సాయి తేజ్‌ రగ్గడ్ యాక్షన్..వెట్రివేల్‌ పాలనిసామి విజువల్స్‌, అజనీష్‌ లోకనాథ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో వస్తున్న సినిమాపై ఈ గ్లింప్స్ అంచనాలు పెంచేసింది. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా భారీ వ్యయంతో సినిమాను నిర్మిస్తున్నారు. సాయి దుర్గా తేజ్‌తో పాటు శ్రీకాంత్, జగపతిబాబు, ఐశ్వర్య లక్ష్మి, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.