Site icon vidhaatha

Sukumar|దిల్ రాజు నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు.. నా చెయ్యి ఇప్ప‌టికీ ప‌ని చేయ‌ట్లేద‌న్న సుకుమార్

Sukumar| లెక్క‌ల మాస్టారు సుకుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. సుకుమార్ తీసిన పుష్ప సినిమా ఆయ‌న‌ని పాన్ ఇండియా లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం పుష్ప 2 ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. అయితే సుకుమార్, బ‌న్నీ కాంబోలో వ‌చ్చిన ఆర్య చిత్రం నిన్న‌టితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా స్పెష‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కి ఆర్య సినిమా కోసం ప‌ని చేసిన వారంద‌రు వ‌చ్చారు. వారు ఆర్య జ్ఞాప‌కాల‌ని పంచుకున్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. దిల్ సినిమా కోసం వినాయ‌క్ ద‌గ్గ‌ర సుకుమార్ ప‌ని చేశాడ‌ట‌. అప్పుడు దిల్ రాజుకి లైన్ చెప్పగా దిల్ సినిమా హిట్ అయితే ఆ సినిమా చేద్దాం అన్నాడ‌ట‌.

ఇక దిల్ మూవీ హిట్ కావ‌డంతో ఆర్య సినిమా ఛాన్స్ సుకుమార్‌కి ఇచ్చారు. ఇక ఆ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట. ఒకరిపై ఒకరు కోపం ప్ర‌ద‌ర్శించుకోడం, అల‌గ‌డం ఇలా చాలా చేశార‌ట‌. ఓ సారి అయితే మూడు రోజులు మాట్లాడుకోలేద‌ట‌. రీల్‌తో అప్పుడు షూట్ చేయ‌డం వ‌ల‌న ఖ‌ర్చు ఎక్కువ‌య్యేద‌ట‌. నిర్మాతగా బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టడానికి దిల్ రాజు ట్రై చేసే వాళ్ళు. అయితే 100 రీల్స్ అయిన ప్రతిసారి నన్ను కొట్టేవాళ్ళు. సడెన్ గా వచ్చి చేయి పట్టుకొని వెనక్కి తిప్పి వీపు మీద దబ దబ కొట్టేవాల్లు. వెన‌క్కి తిప్పి కొట్టిన‌ప్పుడ‌ల్లా నాకు చేయి బాగా నొప్పి వ‌చ్చేది.ఇప్ప‌టికీ నేను పుష‌ప్స్ దాని వ‌ల్ల‌నే చేయ‌లేను అంటూ సుకుమార్ అన్నారు.

అయితే ఈవెంట్‌లో దిల్ రాజు అప్ప‌టి మాదిరిగానే చేయి వెనక్కి తిప్పి వీపు మీద కొట్టడం గమనార్హం. ఇక ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం అల్లు అర్జున్ అని అన్నాడు సుకుమార్. దర్శకులకు చాలా యాటిట్యూడ్ ఉంటుందని అనుకుంటారు. కాని అది అబ‌ద్ధం చాలా కాంప్ర‌మైజ్‌లు ఉంటాయి. నేను అనుకున్న‌ది సాధించ‌డానికి ఎన్నో సార్లు కాంప్ర‌మైజ్ కావ‌ల్సి వ‌చ్చింది. ద‌ర్శ‌కులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకోవాల‌ని అని సుకుమార్ అన్నారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆర్య 125 రోజులు ఆడుతుంది నాన్న అని మా నాన్న‌తో చెప్పాను. నా మాటలు నిజమయ్యాయి. చిరంజీవి గారి నుంచి షీల్డ్ అందుకున్నాను. ఈ సినిమా టాలీవుడ్‌లో గేమ్ ఛేంజర్. అది దిల్ రాజు గారిని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది. సుకుమార్ గారు నా జీవితంలో పెద్ద పిల్లర్ లలో ఒకరు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతని పాటలు ఆర్యకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి అని బ‌న్నీ చెప్పుకొచ్చారు. నా కెరీర్‌లో ఆర్యను ప్రత్యేక చిత్రంగా తీర్చిదిద్దినందుకు ప్రేక్షకులకి థాంక్స్ అని అన్నారు.

Exit mobile version