Actor Sunil | టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ మళ్లీ ఫుల్ బిజీ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ స్టార్ కమెడియన్ తమ సినిమాల్లో ఉంటే కలిసి వస్తుందన్న సెంటిమెంట్ బలపడడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సునీల్ కమెడియన్‌గా, హీరోగా ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విలన్‌గా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో తమిళంలో క్రేజీ ఛాన్స్‌లు చేజిక్కించుకుంటున్నాడు.
సినిమాలో పాత్రను బట్టి రెమ్యునరేషన్ తీసుకునే సునీల్.. కమెడియన్‌గా కెరియర్‌లో పీక్స్‌లో ఉన్నదాని కంటే ఎక్కువగానే ప్రస్తుతం విలన్‌గానే ఎక్కువగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సునీల్ సినిమాకు రూ.5కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. సునీల్‌కి ఉన్న స్టార్ క్రేజ్‌ని చూస్తే రూ.5కోట్లు ఇవ్వడం సబబేనని సినీ పండితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సునీల్ తమిళంలో రెండు సినిమాల్లో చేస్తున్నాడు.
అలాగే మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప-2లో మంగళం శ్రీను పాత్రలో మరోసారి అలరించనున్నాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వదలకుండా కెరీర్‌లో మరోసారి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా.. సునీల్ సైతం అదే స్థాయిలో నెగెటివ్ రోల్స్ సైతం చేస్తూ పాలపుర్ అవుతున్నాడు. ప్రస్తుతం సునీల్ ఇదే ఫామ్‌ను కొనసాగించే అవకాశం ఉన్నది. సునీల్ చివరగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో కిల్లర్ నానిగా కనిపించాడు. పారిజాత పర్వం, పుష్ప, గేమ్‌ఛేంజ్ సినిమాలతో పాటు టర్మో మూవీల్లో నటిస్తున్నాడు.