Site icon vidhaatha

Rajinikanth | ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఆందోళనలో తలైవర్‌ అభిమానులు..!

Rajinikanth | సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు ఇవాళ గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలుస్తున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. మంగళవారం కార్డియాక్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సతీశ్‌ పర్యవేక్షణలో ఎలక్టివ్‌ ప్రొసీజర్‌ను నిర్వహించనున్నారు. తలైవర్‌ ఆసుపత్రిలో చేరారన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఆసుపత్రిలో ఆయన చేరికపై కుటుంబీకులు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన వెట్టయాన్‌ మూవీలో నటిస్తున్నది. చివరగా ఆయన ఆడియో లాంచ్ కార్యక్రమంలో కనిపించారు. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానున్నది.

యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైన్‌గా వస్తున్న వెట్టయాన్‌పై భారీ అంచనాలున్నాయి. చిత్రంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో రజనీ నటిస్తున్నారు. వెట్టయాన్‌ రజనీకాంత్‌ కెరీర్‌లో 170వ చిత్రం. లైకా ప్రొడక్షన్‌ ఈ నిర్మిస్తున్నది. చిత్రాన్ని చెన్నై, ముంబయి, తిరువనంతపురం, హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు రూ.160కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మంజూ వారియర్‌, ఫావద్‌ ఫాసిల్‌, రాణా దగ్గుబాటి కీలకపాత్రలో నటించారు. రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంతకు ముందు రజనీకాంత్‌ సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినా.. ఆరోగ్య సంబంధిత కారణాలతోనే దూరమయ్యారు. వైద్యుల సూచనల నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశంపై వైఖరిని మార్చుకున్నారు.

Exit mobile version