Site icon vidhaatha

Surekha|క‌ష్ట‌ప‌డి ఆవ‌కాయ ప‌చ్చ‌డి చేసిన సురేఖ‌.. క‌ష్టాన్ని గుర్తించి భార్య‌ని దుబాయ్ తీసుకెళుతున్న చిరు

Surekha| మెగా ఫ్యామిలీ ఇత‌ర‌త్రా ప‌నుల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా అకేష‌న్ ఉంటే మాత్రం అంద‌రు ఒక్క చోట క‌లుస్తారు. స‌ర‌దాగా గడుపుతుంటారు. వారి ఆప్యాయ‌త‌, ప్రేమ‌లు చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతుంటారు. అయితే మెగా ఇంటికి కోడ‌లిగా వ‌చ్చిన ఉపాస‌న అయితే ఫ్యామిలీ అంత‌టిని ఒక దగ్గ‌ర చేర్చి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంటుంది. ఆ మ‌ధ్య చిరంజీవి భార్య‌, త‌న అత్త‌మ్మ అయిన సురేఖ‌తో ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఉపాసన ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించారు. సంప్రదాయ రుచులతో ఇంట్లో చేసుకునే వంటకంలా అందులో ప్రొడ‌క్ట్స్ ఉంటాయ‌ని ఉపాస‌న తెలియ‌జేసింది.

రీసెంట్‌గా నోరూరించే ఆవకాయ పచ్చడిని చిరు భార్య సురేఖ తన చేతులతో ప్రిపేర్ చేయగా, అందుకు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఉప్సీ. సురేఖ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తుంటే అంజనాదేవి కూర్చుని చూస్తుంది. అప్పుడు ఉపాస‌న ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి నాయనమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్‌గా ఉన్నారు అని అడుగుతుంది. దానికి ఆమె పనిలేక ఇక్కడ కూర్చున్న అంటుంది. ఆ తర్వాత సురేఖ దగ్గరకు వెళ్లి అత్తమ్మ క్యా హోరా అని అడుగుతుంది. అప్పుడు సురేఖ కూడా త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తుంది. చివ‌ర‌లో వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్ అని చెబుతారు. వీడియో మాత్రం నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

అయితే ఆవకాయ ప‌చ్చ‌డి పూర్త‌య్యాక చివ‌ర‌గా అన్నంలో కలిపి అక్కడ ఉన్న వారందరికీ టేస్ట్ చేయించారు.సురేఖ ఆవకాయ పచ్చడి చాలా బాగా చేసింది అని మెచ్చుకున్నారు చిరంజీవి తల్లి . ఆ త‌ర్వాత సురేఖ‌ని అత్తమ్మ ఎక్క‌డికి వెళుతున్నారు అని ఉపాస‌న అడుగుతుంది.అప్పుడు సురేఖ‌… ఆవ‌కాయ ప‌చ్చ‌డి బాగా చేసినందుకు మీ మామ‌య్య న‌న్ను దుబాయ్ తీసుకెళుతున్నారు. కొద్ది రోజులుగా చాలా వ‌ర్క్స్‌తో బిజీగా ఉన్నందున హాలీడే ట్రిప్ వెళుతున్నాము అని చెప్పింది సురేఖ‌. అయితే ఈ వీడియో వైర‌ల్ కాగా, దీనికి నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, సురేఖ దుబాయ్ ట్రిప్ కి వెళ్తుండటంతో విశ్వంభర షూట్ కి తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ‌ట్టే అని చెప్పాలి.

Exit mobile version