Bala Krishna|నందమూరి బాలయ్య నటుడిగానే కాదు అన్‌స్టాపబుల్ అనే షోతో వ్యాఖ్యాతగాను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షో నాలుగవ సీజన్ మొదలు కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి గెస్ట్‌గా హాజరయ్యారు. ఇక రీసెంట్‌గా సూర్య కూడా షోకి హాజరు కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. నాలుగున్నర నిమిషాల పాటు సాగిన ఈ షోలో సూర్యతో పాటు ‘కంగువ’ దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. కంగువ సినిమా ఈ నెల 14వ తేదిన థియేటర్లలోకి సందడి చేయనుంది.టాక్ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. రెండో ఏపీ సోడ్ లో లక్కీభాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ హజరయ్యారు.
తాజాగా కంగువ టీమ్ కూడా సందడి చేశారు. సూర్య, తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో బాలకృష్ణతో పంచుకున్నారు. బాలయ్య బాబుతో సూర్య చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ముందుగా కార్తి తన ఫోన్‌లో సూర్య నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని బాలకృష్ణ అడగ్గా.. అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ నవ్వుకున్నారు. తన మొదటి క్రష్ ఎవరో చెప్పాలని బాలకృష్ణ కోరగా.. ‘వద్దు సర్ ఇంటికి వెళ్లాలి.. గొడవలు అవుతాయంటూ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ వెంటనే సూర్య తమ్ముడు కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారు. సూర్యకు ఓ హీరోయిన్ అంటే బాగా ఇష్టమని ఈ సందర్భంగా కార్తి చెప్తాడు.
దీంతో ‘నువ్వు కత్తిరా.. కార్తి కాదు’ అంటూ సూర్య సరదాగా అంటాడు. ఇక జ్యోతిక విషయానికొస్తే.. ‘తను లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను’ అంటూ సూర్య కాస్త ఎమోషనల్ అయ్యే సన్నీవేశాలను చూపిస్తారు. ఇక నటుడు సూర్య ‘అగరం’ ఫౌండేషన్ స్థాపించి ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు కూడా ‘అన్‌స్టాపబుల్’ షోలోనూ ఆ వీడియో ప్లే చేయగా, సూర్య మరోసారి ఎమోషనల్ అయి కంట కన్నీరు పెట్టుకున్నాడు.ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ నవంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది.
Simham, Samarasimham kalisina vela,
undadha entertainment sky level lona 🔥#UnstoppableWithNBK Season 4, Episode 3 premieres on Nov 8.#UnstoppableS4 #NandamuriBalakrishna @Suriya_offl @thedeol #AhaVideoIN #AhaOriginalSeries #NBK #kanguva pic.twitter.com/sepYn3G1Pi— ahavideoin (@ahavideoIN) November 5, 2024