Today OTT Movies| ప్రతి శుక్రవారం ఓటీటీలో సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. థియేటర్స్‌లో మంచి సినిమాలు ఉన్నా ఓటీటీలో కంటెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ వారంలో 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండగా, ఈ ఒక్కరోజే అంటే శ్రావణ శుక్రవారం (ఆగస్ట్ 16) సందర్భంగా ఏకంగా 11 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఏయే సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయో కూడా చూద్దాం. ముందుగా శ్రావణ శుక్రవారం స్పెషల్‌గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16, ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 16, పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 16న స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 17న, షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో , చిత్రం)- ఆగస్ట్ 17, ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా)- ఆగస్ట్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వాస్కోడిగామా (తమిళ సినిమా)- ఆగస్ట్ 16న స్ట్రీమ్ అవుతుండగా, యే మేరి ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16న స్ట్రీమ్ అవుతుంది. ఆహా ఓటీటీలో ఎవోల్ (తెలుగు బోల్డ్ మూవీ)- ఆగస్ట్ 16, కొంజల్ పెసినాల్ ఎన్న (తమిళ సినిమా)- ఆగస్ట్ 16, మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 16, బెల్ ఎయిర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- ఆగస్ట్ 16, చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 16,
డిస్పకబుల్ మీ 4 (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 16 స్ట్రీమింగ్ అవుతుంది.
మొత్తంగా ఈ ఒక్కరోజు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 11 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో పెరల్ అనే హాలీవుడ్ హారర్ మూవీ, సూపర్ హీరో చిత్రం షాజమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ సినిమాలు అలాగే తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ ఎవోల్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనున్నాయి. ఇక సత్యరాజ్ నటించిన మై పర్‌ఫెక్ట్ హస్బండ్ అనే వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.