Tollywood| 2024 ఫ‌స్ట్ హాఫ్ పూర్తైంది.. ఎన్ని సినిమాలు హిట్, ఎన్ని సినిమాలు ఫ‌ట్..!

Tollywood|  చూస్తుండ‌గానే ఈ ఏడాది ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెల‌ల్లో చిన్న సినిమాల‌తో పాటు కొన్ని పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ‌ట్ అయింది అనేది చూస్తే.. జనవరి 1 సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా సర్కారు నౌకరి చిత్రం ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన క‌మర్షియ‌ల్‌గా హిట్ కాలేదు. ఇక జ‌న‌వ‌రి 5న 5 చిన్న సినిమాలు రిలీ

  • Publish Date - July 1, 2024 / 08:33 PM IST

Tollywood|  చూస్తుండ‌గానే ఈ ఏడాది ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెల‌ల్లో చిన్న సినిమాల‌తో పాటు కొన్ని పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ‌ట్ అయింది అనేది చూస్తే.. జనవరి 1 సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా సర్కారు నౌకరి చిత్రం ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన క‌మర్షియ‌ల్‌గా హిట్ కాలేదు. ఇక జ‌న‌వ‌రి 5న 5 చిన్న సినిమాలు రిలీజ్ కాగా, ఒక్క సినిమా కూడా మంచి హిట్ అందుకోలేక‌పోయింది. ఇక జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ అయి రెండు భారీ హిట్స్ కొట్టాయి. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజ్ కాగా, జనవరి 14న నాగార్జున నా సామిరంగ రిలీజ్ అయి ఓ మోస్తరు విజ‌యాన్ని అందుకున్నాయి.

ఇక జనవరి 26న హన్సిక 105 మినిట్స్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ కాగా, అవేవి కూడా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయాయి. ఇక ఫిబ్ర‌వ‌రి 2న సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ బూట్ కట్ బాలరాజు సినిమాలతో పాటు 7 చిన్న సినిమాలు రిలీజ్ కాగా వాటిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మాత్ర‌మే మంచి విజ‌యం సాధించింది. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ బయోపిక్ గా తెరెకెక్కిన యాత్ర 2 సినిమా , ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ సినిమా రిలీజవ్వగా అవి యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన చాలా చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. విశ్వక్ సేన్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి సినిమా మంచి హిట్ అయింది. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మంచి టాక్ అందిపుచ్చుకుంది. ఇక ఏప్రిల్, మే సమ్మర్ అంతా ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే గడిచిపోయింది.

ఇక జూన్ లో కూడా చాలా సినిమాలు విడుద‌లైన ఏ చిత్రం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ అందుకుంది లేదు. జూన్ 27న వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD సినిమా భారీ హిట్ కొట్టింది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. అయితే డ‌బ్బింగ్ సినిమాల‌లో ఫిబ్రవరిలో వ‌చ్చిన లవర్, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. జూన్ లో వచ్చిన విజయ్ సేతుపతి సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, గామి, ప్రేమలు, ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్, కల్కి సినిమాలు మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌ని అల‌రించి మంచి డ‌బ్బులు రాబ‌డుతున్నాయి. అయితే స‌మ్మ‌ర్‌లో ఒక్క హిట్ కూడా లేకుండా పోవ‌డ‌మే తీవ్ర నిరాశ‌ప‌రిచే అంశంగా చెప్ప‌వ‌చ్చు.

Latest News