Upasana|అత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డి చేస్తుంటే కోడ‌లు ఉపాస‌న చేస్తున్న‌ఫ‌న్ చూడండి

Upasana| మెగా కోడ‌లు ఉపాస‌న మెగా ఫ్యామిలీలో చేసే సంద‌డి మాములుగా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన విశేషాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల ముందు ఉంచుతుంది. ఇక ఇటీవ‌ల త‌న అత్త‌మ్మ‌తో క‌లిసి `అత్తమ్మా కిచెన్‌`ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి

  • Publish Date - April 21, 2024 / 06:59 AM IST

Upasana| మెగా కోడ‌లు ఉపాస‌న మెగా ఫ్యామిలీలో చేసే సంద‌డి మాములుగా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన విశేషాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల ముందు ఉంచుతుంది. ఇక ఇటీవ‌ల త‌న అత్త‌మ్మ‌తో క‌లిసి `అత్తమ్మా కిచెన్‌`ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సారథ్యంలో ఈ కిచెన్ ప్రారంభం కాగా వారు ప‌చ్చ‌ళ్లు, రుచిక‌ర‌మైన వంట‌కాలు త‌యారు చేస్తూ ఆన్‌లైన్ ద్వారా విక్ర‌యించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బిజినెస్ బాగానే న‌డుస్తుంది.

ఇక దీనిని ఉపాస‌న కూడా త‌నదైన స్టైల్‌లో ప్రమోట్ చేస్తూ మార్కెట్‌ని పెంచుతుంది. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది ఉపాస‌న‌. ఇందులో రామ్‌ చరణ్‌ నాన్నమ్మ అంజనాదేవి, అమ్మ సురేఖలతో ఉపసాన ఫన్నీ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తుండ‌గా, ఇప్పుడు ఆ వీడియోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అంజనాదేవి పర్యవేక్షణలో ఈ పచ్చళ్లు ప్రిపేర్ అవుతుండ‌గా, సురేఖ స్వ‌యంగా మామిడికాయ ప‌చ్చ‌డి త‌యారు చేస్తుంది. మామిడి ముక్కల్లో వెల్లుల్లి కాయలు, ఇతర టేస్టీ పౌడర్స్ వేస్తూ కలుపుతుంది. ఆమె ఆ ప్రిపరేషన్‌లో బిజీగా ఉంది. పని వాళ్లు ఈ ప్రిపరేషన్‌లో ఆమెకి సహయంగా ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో ఉపాసన వీడియో తీస్తూ ఆటపట్టించ‌డం అంద‌రిని ఆక‌ట్టుకుంది.. అంజనా దేవి వద్దకు వెళ్లి నానమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్‌గా ఉన్నారు అని అడ‌గ‌గా, దీనికి ఆమె స్పందిస్తూ సీరియస్‌ ఏం లేదు, పనిలేక ఇలా కూర్చున్నా అని అంటుంది. అప్పుడు మీ కోడలు పని చేయడం లేదా మంచిగా అంటే నువ్వు ఉన్నావుగా కోడలివి అని సమాధానం చెబుతుంది. ఇక ఉపాసన .. సురేఖ వ‌ద్ద‌కు వెళుతుంది. అత్తమ్మ అని అనగా, ఏం చేస్తున్నావని మాత్రం అడక్కు అంటుంది. దీంతో హిందీలో అడగ్గా, అసలుకే రాదు అని ఆమె చెప్పడం తెగ న‌వ్వులు పూయిస్తుంది. మ‌రో ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. హాయ్‌ అంటీ అని విష్‌ చేసి వెల్‌ కమ్‌టూ అత్తమాస్‌ కిచెన్‌ అని ఉపాసన చెప్పడం కూడా నవ్వ‌లు పూయించింది. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్‌గా మారింది.

Latest News