Kanguva| తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసిన సూర్య ప్రేక్షకులకి మంచి వినోదం పంచాడు. ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉన్న అతి తక్కువ మంది నటుల్లో కమల్ హాసన్, రజినీకాంత్ లతో పాటు సూర్య కూడా ఒకరు. తమిళ్ లో తాను చేసిన సినిమాలు ఎన్నో ఏళ్ళు నుంచే తెలుగులో కూడా రిలీజ్ అవుతూ మంచి వసూళ్లు సాధిస్తూ ఉన్నాయి. అయితే సూర్య నటించిన తాజా చిత్రం కంగువా. దీనిపై అంతటా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య బిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య ఆసక్తికరంగా మాట్లాడారు. ‘కంగువా’ ఓ వినూత్న ప్రయత్నం. వందేళ్లక్రితం జన జీవనం, వారికి ఎదురైన కష్టాలు.. తదితర అంశాలను స్క్రీన్‌పై చూపిస్తే బాగుంటుందని ‘కంగువా’ చిత్రం చేశాను. హాలీవుడ్ స్థాయి సినిమా చేయాలనే కోరిక ‘కంగువా’తో తీరిపోయింది. అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించిన శివకు థ్యాంక్స్’ అని తెలిపారు సూర్య. చిత్రంలో మొసలితో ఉండే ఫైట్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని అన్నారు.
సినిమాలో మొసలితో ఉండే ఫైట్ సీక్వెన్స్ కోసం వేల మంది పనిచేసారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ని బ్యాంకాక్ లో, చెన్నైలో షూట్ చేసాము. ఆ సీన్ కోసం దాదాపు సూర్య వారం రోజుల పాటు నీళ్లలోనే ఉంటూ నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన్ని బాగా కష్టపెడుతున్నాను ఏమో అని అనిపించింది. ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని దర్శకుడు శివ తెలియజేశారు. శివకి ఉన్న మంచి విజన్‌కు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చి కంగువాకి పని చేశారని అన్నాడు. శివకి ఉన్న పాజిటివిటీతోనే ఈ కంగువా ఇంత గ్రాండియర్‌గా వచ్చిందని అన్నాడు సూర్య. మూవీపై మాత్రం భారీ అంచనాలే ఉండగా, ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.