Varun Sandesh| నిద్ర మాత్ర‌లు మింగిన వ‌రుణ్ సందేశ్ భార్య‌.. కార‌ణమెంటో రివీల్ చేసిన వితికా భ‌ర్త‌

Varun Sandesh| ఒక‌ప్పుడు మంచి చిత్రాలు చేసి ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైన హీరో వ‌రుణ్ సందేశ్. ఆయ‌న చేసిన చిత్రాల‌లో ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’.. ఇప్పటికీ యూత్‌కు గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి. మంచి హిట్స్ అందుకున్న వ‌రుణ్ సందేశ్ ఆ త‌ర్వాత అదే జోరుని కొ

  • Publish Date - June 12, 2024 / 06:35 AM IST

Varun Sandesh| ఒక‌ప్పుడు మంచి చిత్రాలు చేసి ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైన హీరో వ‌రుణ్ సందేశ్. ఆయ‌న చేసిన చిత్రాల‌లో ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’.. ఇప్పటికీ యూత్‌కు గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి. మంచి హిట్స్ అందుకున్న వ‌రుణ్ సందేశ్ ఆ త‌ర్వాత అదే జోరుని కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఇటీవ‌ల తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌రుణ్ సందేశ్ ఒకప్పుడు తన భార్య వితికా స్లీపింగ్ పిల్స్ వేసుకుందంటూ వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూ పుకార్లు అన్నింటికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు

వ‌రుణ్ సందేశ్, వితికా క‌లిసి సినిమా చేశారు. ఆ స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదిలోనే వితికా షేరు స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ అప్పుడ తెగ ప్ర‌చారాలు జ‌రిగాయి. దానికి ఇప్పుడ వ‌రుణ్ సందేశ్ క్లారిటీ ఇచ్చాడు. వితికాకి ఆరోగ్యం బాలేక ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింది. అయితే త‌న‌కు నిద్ర స‌మ‌స్య ఉండ‌డం వ‌ల‌న డాక్ట‌ర్ మందులు ఇచ్చాడు. అయితే డాక్టర్ ఇచ్చిన మందుల కంటే కాస్త ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్‌లో అడ్మిట్ కావ‌ల‌సి వ‌చ్చింద‌ని వ‌రుణ్ సందేశ్ తెలియ‌జేశాడు. నేను ఆ స‌మ‌యంలో అమెరికాలో ఉన్నాను. విష‌యం తెలుసుకొని ఇండియాకి వ‌చ్చాను. దానిపై క్లారిటీ ఇచ్చే లోపే ఈ వార్త వైర‌ల్ అయింది అని అన్నాడు వ‌రుణ్ సందేశ్‌.

ఇక వితికాతో పెళ్లికి ముందు తను 2,3 రిలేషన్‌షిప్స్‌లో ఉన్న‌ట్టు తెలియ‌జేశాడు. పెళ్ల‌య్యాక ఫ్యామిలీ మ్యాన్‌గా మారిన‌ట్టు పేర్కొన్నాడు.వితికా త‌న లైఫ్ లైన్ అని చెబుతూ త‌ను ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ చేస్తుంద‌ని కూడా తెలియ‌జేశాడు. తను కంటెంట్ చేయడం అనేదే చాలా గ్రేట్. అందరూ తనను ప్రశంసిస్తుంటారు కానీ దాని వెనుక కష్టం నేను చూస్తున్నాను. దానికి చాలా ఓపిక, ప్లానింగ్, డెడికేషన్ అన్నీ ఉండాలి. పెళ్లి త‌ర్వాత మా ఇద్ద‌రి జీవితాల‌లో అనేక మార్పులు వ‌చ్చాయి. చాలా సంతోషంగా ఉన్నాం. ప్ర‌స్తుతం మా ప‌నుల్లో మేము బిజీగా ఉండ‌డం వ‌ల‌న పిల్ల‌ల గురించి త్వ‌ర‌లో ఆలోచిస్తామ‌ని వ‌రుణ్ సందేశ్ తెలియ‌జేశాడు.

Latest News