Site icon vidhaatha

Vettaiyan Remuneration | వెట్టాయన్‌ మూవీకి రజనీకాంత్‌కి అన్నికోట్ల పారితోషకమా..? మరి అమితాబ్‌ బచ్చన్‌కి ఎంతో తెలుసా..?

Vettaiyan Remuneration | సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) నటించిన వెట్టయాన్‌ (Vettaiyan) మూవీ దసరా కానుకగా విడుదలైంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వెట్టయన్ (Vettaiyan) విడుదలైంది. సూపర్‌ కలెక్షన్స్‌తో మూవీ దూసుకుపోతున్నది. డీజే జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో వచ్చిన మూవీ మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. చాలాకాలం తర్వాత రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కలిసి నటించారు. ఇద్దరు సూపర్ స్టార్లు చివరిసారిగా 1991లో హమ్ అనే చిత్రంలో నటించగా.. మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మళ్లీ వెట్టయాన్‌లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రజనీకాంత్‌ జోడీగా మంజువారియర్‌.. మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌, దగ్గుబాటి రాణా కీలకపాత్రలు పోషించగా.. అనిరుద్‌ మ్యూజిక్‌ అందించాడు. దాదాపు రూ.300కోట్లతో వెట్టయాన్‌ తెరకెక్కించారు.

సినిమా ఆరో రోజు కలెక్షన్స్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.264.31కోట్లకు చేరింది. భారత్‌ సినిమా కలెక్షన్స్‌ రూ.114.60కోట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా, మూవీ రజనీకాంత్‌ కోసం రూ.125కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారని టాక్‌. ఇక అమితాబ్‌ బచ్చన్‌ రూ.7కోట్ల తీసుకున్నారని తెలుస్తున్నది. అమితాబ్‌ కంటే రజనీకాంత్‌ 17రెట్లు ఎక్కువగా రెమ్యునరేషన్‌ అందుకున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్లకు రెమ్యునరేషన్‌లో ఇంత వ్యత్యాసం ఉండడంపై అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఇక వెట్టాయన్‌లో చాలా నటీనటులు కనిపించారు. మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్ ఫాజిల్ రూ.3కోట్ల చొప్పున పారితోషకం తీసుకున్నారు. మంజు వారియర్‌ పాత్ర కోసం రూ.2.5కోట్లు తీసుకున్నట్లు టాక్‌. ఇక రాణా దగ్గుబాటి రూ.5కోట్లు.. రితికా సింగ్‌ రూ.25 లక్షల నుంచి రూ.35లక్షల వరకు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version