Site icon vidhaatha

Vidya Balan|అయ్యో పాపం.. డ్యాన్స్ చేస్తూ విద్యా బాల‌న్ అలా ప‌డిపోయింది.. ప‌క్క‌నే ఉన్న మాధురి..!

Vidya Balan|బాలీవుడ్ బ్యూటీ విద్యా బాల‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తోను అంద‌రి మ‌న‌స్సులు కొల్ల‌గొడుతూ ఉంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా భూల్ భులయ్యా 3 మూవీలో న‌టించింది. అయితే మ‌వీ టీమ్ ‘ఆమీ జే తోమర్ 3’ పాట లాంచ్ చేసింది. ఈ పాటలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్(Vidya Balan) అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకున్నారు. కాగా సాంగ్ రిలీజ్ సందర్భంగా అందాల భామలు మాధురీ దీక్షిత్, విద్యాబాలన్‌ల ప్రత్యేక నృత్య ప్రదర్శనను ప్లాన్ చేశారు. ‘రాయల్ ఒపెరా హౌస్’ అనే చారిత్రక థియేటర్ వేదికపై వారిద్దరు స్పెష‌ల్ డ్యాన్స్ చేయ‌గా, ఆ డ్యాన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. అయితే లైవ్ ప‌ర్‌ఫార్మెన్స్ స‌మ‌యంలో విద్యా బాల‌న్ అదుపు త‌ప్పి ప‌డింది.

కింద ప‌డిన కూడా విద్యాబాల‌న్ త‌న డ్యాన్స్ మూమెంట్స్‌తో క‌వ‌ర్ చేసింది.త‌న ముఖంలో చిరున‌వ్వు అలా క‌నిపించేలా చేస్తూ డ్యాన్స్ కొన‌సాగించింది. అది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా ఫుల్‌గా థ్రిల్ అయ్యారు. అంతేకాదు డ్యాన్స్ ముగిసిన వెంటనే, కార్తీక్ ఆర్యన్(Karthi Aaryan) , మాధురీ దీక్షిత్ ఇద్దరూ విద్యను కౌగిలించుకొని ఆమెను ప్రశంసించారు. అయితే విద్య ప‌డిపోవ‌డంపై మాధురి దీక్షిత్ ఫ‌న్నీ కామెంట్ చేసింది. విద్య ప‌డిపోయిన‌ప్పుడు ఆమెని నేను చూశాను. ఒక‌వేళ లేవ‌క‌పోయి ఉంటే నేను కింద‌ప‌డ‌తానేమో, అప్పుడు ఇద్ద‌రం క‌లిసి ‘మార్ దాలా’ పాటకు స్టెప్పులు వేసేవాళ్లం. కానీ విద్య తనని తాను చాలా బాగా హ్యాండిల్ చేసింది అని మాధురీ అన్నారు.

విద్యాబాలన్ కిందపడి నిలబడటమే కాకుండా ‘వన్స్ మోర్’ అనే పబ్లిక్ డిమాండ్‌ చేయడంతో ‘ఆమీ జే తోమర్’ పాటలో మరోసారి డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక కార్తీక్ ఆర్య‌న్ విద్యాని ఆట ప‌ట్టించాడు.ఇప్పుడు టేక్ ఓకే అని అన్నాడు. ద‌ర్శకుడు అనీస్ బ‌జ్మీ.. రెండు టేక్స్ ప‌ర్పెక్ట్ సినిమాలో పెట్టొచ్చు అని ఫ‌న్నీ కామెంట్ చేశారు. విద్యా బాల‌న్(Vidya Balan) కింద ప‌డిన‌ప్పుడు ఒంటి కాలిపై నిలుచునేందుకు ప్ర‌య‌త్నించింది.ఆమె గాయం కారణంగా, విద్య పాదరక్షలు లేకుండా తిరిగింది. నొప్పితో బాధ‌ప‌డుతున్నా కూడా ఈవెంట్ మొత్తం ఉంది. ఇక ఫోటోగ్రాఫర్స్ కు ఫోటోలు ఇవ్వడానికి విద్య తన చెప్పులను ధరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె పాదాల నొప్పి కారణంగా వాటిని ధరించలేక చాలా ఇబ్బందులు ప‌డింది. అయితే విద్య డెడికేష‌న్‌ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు.

Exit mobile version