Site icon vidhaatha

Virat Kohli| అనుష్క క‌న్నా ముందు ఈమెతో రెండేళ్లు ప్రేమ‌లో ఉన్న విరాట్.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్

Virat Kohli| స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఆయ‌న న‌టి అనుష్క‌శ‌ర్మ‌ని వివాహం చేసుకొని ప్ర‌స్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాడు. అయితే అనుష్కని ప్రేమించ‌క‌ముందు విరాట్ ఎవ‌రితోనైన డేటింగ్‌లో ఉన్నాడా, ప్రేమాయ‌ణాలు న‌డిపాడా అనేది ఎప్పటికీ హాట్ టాపికే. అనుష్క‌ని ప్రేమించ‌క ముందు విరాట్ కోహ్లీ.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ మూవీ ఫేం ఇజ‌బెల్లా లైట్ తో డేటింగ్ చేశాడ‌ని స‌మాచారం. విరాట్ త‌న‌కు అత్యంత స‌న్నిహ‌తుడు అని చెప్పిన ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా త‌న‌కు స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. ఇజాబెల్లె త‌న జీవితం గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను.

అయితే మీడియాలోని కొంత‌మంది నాపై దుష్ప్ర‌చారం చేశారు. పుకార్ల‌న్ని నిజాలు ఎప్ప‌టికీ కావు. ఈ వృత్తిలో ఉన్నాను కాబ‌ట్టి నా జీవితం గురించి అలా ప్ర‌చారం చేసి ఉంటారు. నా ప‌నిలో ఇది కూడా భాగం కాబ‌ట్టి అర్ధం చేసుకొని ఊరుకున్నా అని తెలిపింది. `పురాణీ జీన్స్ `సహనటుడు తనున్ విర్వాణితో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు ప్ర‌చారాలు రాగా వాటిని ఇజ‌బెల్లే ఖండించింది. అత‌ను నా స‌హ‌న‌టుడు. పురాణి జీన్స్ వ‌ర్క్ షాప్ మొద‌లైన్ప‌టి నుండి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అత‌ని పేరెంట్స్‌తో కూడా నాకు మంచి రిలేష‌న్ ఉంది. వారంద‌రితో ఫ్యామిలీ రిలేష‌న్ షిప్ త‌ప్ప మ‌రో కార‌ణం లేద‌ని పేర్కొంది ఇజ‌బెల్లా.

ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన ఆమె నాకు ఇండియా ఫ్రెండ్స్‌లో విరాట్ ఒక‌రు. చాలా కాలం పాటు ఇద్ద‌రం డేటింగ్ చేశాం. రెండేళ్ల‌పాటు క‌లిసి ఉన్నాం. అయితే ఆ విష‌యాన్న మేము బ‌హిర్గతం చేయ‌ద‌ల‌చుకోలేదు. విరాట్‌తో నాకు రిలేషన్ ఉంది కాని సిద్ధార్థ్ మాత్రం స్నేహితుడు మాత్రమే అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇజ‌బెల్లె చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కి ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ న‌టించిన‌ వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఇజబెల్లా లైట్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో ఇజబెల్లాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ న‌టించారు. ఈ చిత్రం ఫ్లాప్ కావ‌డంతో ఇజ‌బెల్లా ఎక్క‌వ‌గా హ‌లైట్ కాలేక‌పోయింది

Exit mobile version