VV Vinayak| ఎలా ఉండే వివి వినాయ‌క్ ఎలా అయిపోయారు.. ఏంటి స‌మ‌స్య‌..!

VV Vinayak| టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో వివి వినాయ‌క్ ఒకరు. ఆయ‌న ఎన్నో మాస్ చిత్రాలు తెర‌కెక్కించిన స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగారు. ఆది అనే సినిమాతో వివి వినాయ‌క్ డైరెక్ట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా విడుదలైన ఆది బ్లాక్ బస్టర్ అయింది. డెబ్యూ మూవీతోనే భారీ హ‌ట్ కొట్టిన ఈ ద‌ర్శ‌కు

  • Publish Date - June 1, 2024 / 06:30 AM IST

VV Vinayak| టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో వివి వినాయ‌క్ ఒకరు. ఆయ‌న ఎన్నో మాస్ చిత్రాలు తెర‌కెక్కించిన స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగారు. ఆది అనే సినిమాతో వివి వినాయ‌క్ డైరెక్ట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా విడుదలైన ఆది బ్లాక్ బస్టర్ అయింది. డెబ్యూ మూవీతోనే భారీ హ‌ట్ కొట్టిన ఈ ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత బాల‌య్య సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది.చెన్న‌కేశవ‌రెడ్డి చిత్రం ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌గా ఈ మూవీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది. ఇక దిల్ అనే చిత్రాన్ని త‌న మూడో చిత్రంగా తెరకెక్కించ‌గా, ఈ చిత్రం సూప‌ర్ హిట్. ఆ త‌ర్వాత చిరంజీవి హీరోగా ఠాగూర్ చిత్రం చేశాడు. ఈ మూవీ బ‌డా హిట్ అయింది. దీంతో టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరాడు వినాయ‌క్.

ఇక ఆ త‌ర్వాత చేసిన సాంబ యావరేజ్, బన్నీ సూపర్ హిట్, లక్ష్మి హిట్, యోగి యావరేజ్, కృష్ణ సూపర్ హిట్, అదుర్స్ సూపర్ హిట్, బద్రీనాథ్ ప్లాప్, నాయక్ యావరేజ్, అల్లుడు శ్రీను హిట్, అఖిల్ డిజాస్టర్ ఇలా హిట్‌, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు తీసాడు. అయితే చిరంజీవి క‌మ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం 150తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన వినాయ‌క్.. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ తో మరో డిజాస్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక అప్ప‌టి నుండి సినిమాలు పెద్ద‌గా చేయ‌డం లేదు. అయితే గ‌త కొద్ది రోజులుగా వివి వినాయ‌క్ ఆరోగ్యానికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదని, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏవో ఇబ్బందులు తలెత్తాయి అని అంటున్నారు.

ఈ క్ర‌మంలో దీనిపై వివి వినాయక్ సోదరుడు క్లారిటీ ఇస్తూ.. వినాయక్ కు ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు అని గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలే అని చెప్పుకొచ్చారు. ఆయ‌న అనారోగ్యం పై వస్తున్న వార్తలు నమ్మవద్దని ఆయన ఆరోగ్యంగా ఉన్నారని స్ప‌ష్టం చేశాడు. అయితే మే 31న సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వివి వినాయ‌క్ ఆయ‌న‌తో ఉన్న జ్ఞ‌పకాలు పంచుకున్నారు. కృష్ణ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే ఆనందం వేస్తుంది. కృష్ణ గారు ఫర్ ఎవర్. హ్యాపీ బర్త్ డే సర్.. అని వీడియో షేర్ చేయ‌గా, ఇందులో ఆయ‌న చాలా వీక్‌గా క‌నిపిస్తున్నారు. గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోతున్నారు. వినాయక్ ను చూసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఎలా ఉండేవాడివి.. ఇలా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News