Site icon vidhaatha

Rajinikanth|ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌ని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు.. ప్ర‌ధాన పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారంటే..!

Rajinikanth| సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ర‌జ‌నీకాంత్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. బ‌స్సు కండ‌క్ట‌ర్ నుండి సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు ర‌జ‌నీకాంత్. ఆయ‌న జీవితం చాలా మందికి ఆద‌ర్శం. 70 ఏళ్లు దాటిన కూడా ఇప్ప‌టికీ హీరోగా కొన‌సాగుతూ త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. కొన్నాళ్లుగా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న ర‌జ‌నీకాంత్‌కి జైల‌ర్ రూపంలో మంచి హిట్ దొరికింది. ఇప్పుడు ఆ ఉత్సాహంతోనే టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వేట్టయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఇక ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ తీయాల‌ని ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. తిరుగులేని స్టయిల్‌, ఇమేజ్‌, మార్కెట్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్‌ జీవితంపై సినిమా వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రికి మంచి వినోదం ద‌క్క‌డం ఖాయం. ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ కోసం అభిమానులు, సినీ ప్రియులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ హ‌క్కుల‌ని బాలీవుడ్ మేక‌ర్ సాజిద్ న‌డియావాలా ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయ‌న ఈ సినిమా నిర్మించేందుకు ఆస‌క్తి చూపుతున్నాడ‌ని టాక్ కూడా వినిపిస్తుంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని అంటున్నారు.

ఇక ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది. ర‌జ‌నీకాంత్ స్టయిల్‌ని,మ్యానరిజాన్ని పట్టుకొని అచ్చం ఆయ‌న మాదిరిగా న‌టించ‌డం క‌త్తి మీద సామే అవుతుంది. కాస్త అటు ఇటు ఉన్నా కూడా సినిమా ఫ‌లితంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అయితే ర‌జ‌నీకాంత్ పాత్ర‌ని ధ‌నుష్ చేయ‌నున్న‌ట్టు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాక‌పోతే ధ‌నుష్ ఫిజిక్ ప‌రంగా సూట్ కాడు. మ‌రి దాని కోసం ఏమైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మూవీని ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌నేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Exit mobile version