Site icon vidhaatha

Manchu Vishnu|మంచు విష్ణు బెదిరింపుల‌కి దిగాడా..కాల్ రికార్డింగ్ లు, ఫ్రూఫ్ లు ఉన్నాయంటున్న యూట్యూబ‌ర్

Manchu Vishnu| సినిమా ప‌రిశ్ర‌మ‌కి చెందిన నటీనటులను విమర్శిస్తూ అసత్య వార్తలని ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) 18 చానళ్లను రద్దు చేయించింది. దీనిపై యూట్యూబ‌ర్ కింగ్ చంద్ర‌హాస్ ఓపెన్‌గా ఛాలెంజ్ విసిరారు. మంచు విష్ణు చేస్తున్న ప‌నులపై వీడియో పోస్ట్ చేశాడు. మంచు విష్ణు ఇన్నాళ్లు బ్లాక్ చేయించిన యూట్యూబ్ ఛానల్స్ నటీనటులపై ట్రోల్స్ చేసినవి కాదని.. మంచు ఫ్యామిలీని, కన్నప్ప సినిమాని ట్రోల్ చేసిన ఛానల్స్ అని ఆ వీడియోలో తెలియ‌జేశాడు.కన్న‌ప్ప గురించి ట్రోల్స్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌ని ఆయ‌న బ్లాక్ చేయించాడు అని చంద్ర‌హాస్ చెప్పుకొచ్చాడు.

చెప్పినవి 18 అయినా అనధికారికంగా చాలా ఛానల్స్ బ్లాక్ చేసాడు. ఎవ‌రి ఫ్యామిలీల‌ని మేము ట్రోల్ చేయ‌ము. నిన్నే చేస్తున్నాం అంటే నువ్వు చేసే ప‌నులు అలా ఉన్నాయి మ‌రి. అయితే బ్లాక్ అయిన ఛానెల్స్ వారు క‌న్న‌ప్ప సినిమా గురించి పాజిటివ్‌గా వీడియోలు చేస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్స్ తీయిస్తామని కూడా మెయిల్స్ చేసినట్టు వ్యాఖ్యానించాడు. ‘కన్నప్ప’ మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించి ఫ్రూప్ కూడా చూపించాడు. దీనిపై 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది.

పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దాంతో చంద్రహాస్ తాజాగా మరో వీడియో రిలీజ్ చేసారు. యూట్యూబర్స్ ని బ్లాక్ మెయిల్ చేయటం నిజమే అని, ఆ మెయిల్స్ కూడా నిజమే అని, తన దగ్గర అన్ని ఫ్రూఫ్ లు ఉన్నాయంటూ చంద్ర‌హాస్ చెప్పుకొచ్చాడు.తన దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్ లు, నెంబర్స్, ప్రతీది నా దగ్గర ఉంది. అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తాను అన్నారు. మీరు నన్ను ఫేక్ అంటున్నారు కాబట్టి నిజమేంటనేది సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తాను అంటూ మంచు విష్ణుని ట్యాగ్ చేసారు. మ‌రి ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

Exit mobile version