Site icon vidhaatha

Bigg Boss| ఇద్ద‌రు పెళ్లాల‌తో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ.. ఎలా ఉండాలో చెప్పి మ‌రీ పంపారుగా..!

Bigg Boss| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి మంచి క్రేజ్ ద‌క్కించుకుంటుంది.తెలుగు లోనూ బిగ్ బాస్ షో విజయవంతంగా ఏడూ సీజన్స్ పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో ఎనిమిదో సీజ్‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో ఓటీటీ సీజ‌న్స్‌తో కూడా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ షోకి సినిమా వాళ్లు, సీరియల్ ఆర్టిస్ట్ లు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు హిందీలో కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజ‌న్ -3 ప్రారంభ‌మైంది. ఇందులో ఫేమ‌స్ యూట్యూబ‌ర్ ఆర్మాన్ మాలిక్ త‌న ఇద్ద‌రు భార్య‌ల‌తో పాల్గొన‌డం హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఒక కంటెస్టెంట్ త‌న ఇద్ద‌రు భార్య‌ల‌తో షోలో పాల్గొన‌డం ఇదే తొలిసారి.

ఇద్ద‌రి భార్య‌ల‌తో షోలో పాల్గొని స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తావు అంటూ ఆర్మాన్ మాలిక్‌పై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. అయిదే దీనిపై స్పందించిన ఆర్మాన్ .. మా మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవు, ఫ్యామిలీగా ఎలా క‌లిసి ఉండాలో చూపించేందుకు షోకి వ‌చ్చామ‌ని అన్నాడు. త‌న‌లాంటి వాళ్ల‌కి ధైర్యం నింపేందుకు షోకి వ‌చ్చాన‌ని పేర్కొన్నారు. ఇక ఇద్ద‌రు పెళ్లాల‌తో బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఉండాలో కూడా కొన్ని విష‌యాల‌పై ఆయ‌నకి అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌యత్నం చేశార‌ట నిర్వాహ‌కులు. మరి మ‌నోడు ఎన్ని రోజులు హౌజ్‌లో ఉంటాడో, ఎంత‌గా అల‌రిస్తాడో చూడాల్సి ఉంది.

ఇక ఆర్మాన్ విష‌యానికి వ‌స్తే ఆయ‌నది ప్రేమ వివాహం. పాయ‌ల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆర్మాన్. పాయ‌ల్ బ్యాంక్ ఉద్యోగి కాగా ఆమెని ల‌వ్ లో ప‌డేసి పెళ్లిచేసుకున్నాడు. ఆ త‌ర్వాత క్రితికా మాలిక్ తో నూ ఆర్మాన్ ప్రేమ‌లో ప‌డ్డాడు. క్రితాకి పాయ‌ల్ కి మంచి స్నేహితురాలు కాగా,ఆమె ద్వారానే ఆర్మాన్‌కి క్రితికా పరిచ‌య‌మైంది. మొద‌ట్లో వారికి గొడ‌వ‌లు అయిన ఇప్పుడు అంతా సెట్ అయి సంతోషంగా ఉన్నారు. ఇద్ద‌రు భార్య‌ల‌కి కూడా పిల్ల‌లు ఉన్నారు. వారు అప్ప‌ట్లో హైద‌రాబాద్‌లో ఉండ‌గా, ఇప్పుడు పంజాబ్‌లో ఉంటున్నాడు. ఎట్ట‌కేల‌కి బిగ్ బాస్ లో పాల్గొనే అవ‌కాశం ద‌క్కించుకున్న ఆర్మాన్ మాలిక్ త‌న ఆట‌తో అద‌ర‌గొట్టాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

Exit mobile version