Site icon vidhaatha

ఘోర రోడ్డు ప్రమాదం .. 18 మంది మృతి

విధాత:ఉత్తర్​ప్రదేశ్​లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.బారాబంకి జిల్లా రామ్​స్నేహిఘాట్​ ప్రాంతంలోని లఖ్​నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు హరియాణా నుంచి బిహార్​కు వెళ్తోందని చెప్పారు. క్షతగాత్రులను లఖ్​నవూ ట్రామా సెంటర్​కు తరలించారు.

Exit mobile version