Site icon vidhaatha

మహారాష్ట్ర – కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

విధాత‌: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూపు ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ ) కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతుండగా, మహారాష్ట్రలోని పూణే , ఠానే రూరల్, ఠానే సిటీతో పాటు మీరా భయాందోర్‌లో కూడా ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నాయి. కాగా ఈ దాడుల్లో అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఆధారిత ఐఎస్ఐఎస్ కార్యకర్తల ప్రమేయంతో పెద్ద కుట్రను బయటపెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి.

సామాజిక మాద్య‌మాల్లో ఐఎస్ఐఎస్‌ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న నిందితుల కోసం విచారణ చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఈ దాడులు చేస్తున్న 44 ప్రాంతాల్లో కర్ణాటకలో ఒకచోట, పూణేలో రెండు, ఠానే రూరల్ లో 31, ఠాణే నగరంలో 9 బయందర్ లో ఒకచోట అధికారులు సోదా చేశారు. ఠానేలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version