మేషం
మేషరాశి వారికి ఈ రోజు ఆనందమయంగా గడుస్తుంది. ప్రతి రంగంలోనూ మీరు విజేతగా నిలుస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు వెల్లి విరుస్తాయి. స్నేహితులతో, కుటుంబంతో విహార యాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు కెరీర్‌లో ప్రగతిపథంలో దూసుకెళ్తారు. ఆర్థిక లాభం ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కష్ట కాలం. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థికపరంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. సహనం వహించండి. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంది. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు జరగవచ్చు. ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత పరవాలేదు.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. స్పష్టమైన వైఖరితో, ఆకట్టుకునే మాటతీరుతో ముఖ్యమైన సమావేశాల్లో అందరినీ ఆకర్షిస్తారు. ఆత్మవిశ్వాసంతో కూడిన పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ రోజు కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వహించండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభాలున్నాయి. సన్నిహితులతో కలిసి పర్యటనలు చేస్తారు. స్నేహితులతో అనవసర వాదనలు మానుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శుభ ఫలితాలున్నాయి. తలపెట్టిన పని విజయవంతం అవుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మొదలు పెట్టడానికి సరైన తరుణం. వ్యాపారులకు శుభం జరుగుతుంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ వర్తమానం వింటారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఈ రోజు ఒక సువర్ణావకాశం అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అంతటా విజయమే. ఇంట్లో ప్రేమపూరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల లాభం పొందుతారు.