మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. నలుగురిలో మాట్లాడేటప్పుడు అలోచించి ఆచి తూచి మాట్లాడాలి. వృత్తి పట్ల అంకితభావంతో ఉంటే సత్ఫలితాలు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ప్రయాణాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేయండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్వరమే ఫలిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కీలక వ్యవహారాల్లో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. మీ సత్ప్రవర్తనతో అందరి మనసులు గెలుచుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు మంచి లాభదాయకంగా ఉంది. మీ ప్రతిభతో పదోన్నతులు పొందుతారు. ఇతరులు అసూయ పడేలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. అన్ని వైపులా నుంచి ప్రతికూల పవనాలు వీస్తుండడం వల్ల ఎట్టి పరిసితుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు, కలహాలు ఏర్పడవచ్చు. పని ఒత్తిడితో శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బ తింటాయి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. నిరాశ నిస్పృహలకులోను కావద్దు. మనోధైర్యంతో సకాలంలో పనులు పూర్తి చేస్తే విజయం మీదే.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప వ్యక్తుల మాటలకు ప్రభావితం అవుతారు. కీలక నిర్ణయాలలో స్పష్టమైన వైఖరితో ఉండడం అవసరం.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రకాల ఆటంకాలు, సవాళ్లు సమర్ధవంతంగా తిప్పికొడతారు. మీ ప్రతిభకు, సామర్ధ్యానికి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికంగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరుషమైన మాటల కారణంగా ఇంటా బయట శత్రువులు పెరుగుతారు. సంతానం అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పనులు పూర్తి చేయాలంటే అధికశ్రమ తప్పనిసరి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వింటారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమయానుకూలంగా నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. మీ పట్టుదలే మీకు విజయం చేకూరుస్తుంది. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఈ రోజు పనిప్రదేశంలో సమస్యాత్మకమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల చిత్తశుద్ధితో ఉండాలి. నిర్లక్ష్య వైఖరి తగదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.