Site icon vidhaatha

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో ఆటంకాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఈ రోజంతా వాదనలు, వివాదాలతో సాగుతుంది. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలలో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కరించడం చాలా కఠినంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. నిరాశ చెందకండి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబంలో, పని ప్రదేశంలో వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూలతలు తొలగిపోతాయి. ఈ రోజు చేపట్టిన నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి. అనూహ్య ధనలాభాలున్నాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో మీ మాట నెగ్గించుకుంటారు. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సంతానంకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండాలి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభాలున్నాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతం తాలూకు చేదు అనుభవాలను విస్మరించి ముందుకెళ్లడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలున్నా అధిగమిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆశ్చర్యపరిచే అనేక సంఘటనలు ఈ రోజు చోటు చేసుకుంటాయి. వృత్తివ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేయండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి అందిన శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. అధికారుల నుంచి శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం నిరాశ పరుస్తుంది. ఖర్చులు, రుణభారం పెరగవచ్చు. ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. కళాకారులకు, మీడియా రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల విముక్తి లభిస్తుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాల కోసం అధిక శ్రమ అవసరం. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి బుద్ధిబలంతో వ్యవహరించండి. మానసికంగా దృఢంగా ఉంటారు. సానుకూల పరిస్థితుల ప్రభావంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.

Exit mobile version