మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం పెరిగినా చక్కని సమయపాలనతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బుద్ధిబలంతో ఆర్థిక సమస్యలు అధిగమిస్తారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. వృత్తి పరంగా పురోగతి లోపించడంతో అసంతృప్తి చెందుతారు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదం విడిచి పెడితే మంచిది. కుటుంబ పరిస్థితులు కూడా పూర్తిగా నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెట్టింపు ఉత్సాహంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పనిప్రదేశంలో ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా మంచి లాభాలు అందుకుంటారు. మీ విజయానికి బాటలు వేసుకుంటారు. సన్నిహితుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సహచరుల ప్రోత్సాహం ఉంటుంది. పదోన్నతులు అందుకుంటారు. ధనలాభాలున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటి అలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. వృత్తి పరమైన పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో నైపుణ్యం పెరగడంతో పదోన్నతులు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలంతో ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని సమస్యలు మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. కొన్ని శుభవార్తలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఆనందకర సమయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. భూ, గృహ యోగాలున్నాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అనేక రకాల ప్రలోభాలకు లోనవుతారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త వహించండి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వివాదాలు, అనవసర చర్చలకు దూరంగా ఉండండి. కొత్తగా ప్రారంభించాల్సిన పనులను వాయిదా వేయండి.