మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఆనందమయంగా ఉంటుంది. కుటుంబంలో ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రతి రంగంలోనూ విజేతగా నిలుస్తారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభం ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన పనులు పూర్తి కావాలంటే దృఢమైన సంకల్పం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు కష్ట కాలం. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి మందగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో తెలివిగా నిర్వహించాలి. కుటుంబ వాతావరణం కలహపూరితంగా ఉంటుంది. సహనం వహించండి. అనుకోని ఖర్చులు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సద్బుద్ధితో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సరైన ప్రణాళిక అవసరం. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థికంగా మేలైన సమయం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్వయం కృషితో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థికంగా విశేషమైన యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సత్ప్రవర్తనతో, పరోపకార గుణంతో అందరినీ ఆకర్షిస్తారు. వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకుంటారు. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ, అలసట పెరుగుతుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. మిత్రులతో, ప్రియమైన వారితో అనవసర వాదనలకు దిగకుండా సమన్వయ ధోరణితో ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున అన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. శుభ భవిష్యత్తు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు. ఆర్థికపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతం పెంపుదల, పదోన్నతులు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. విదేశీ ప్రయాణానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది. వృత్తి పరంగా బాగా రాణిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కాలం అంతగా సహకరించడం లేదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. కీలక వ్యవహారాల్లో సహనం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగవద్దు. అనవసర భయాందోళనలు దరి చేరనీయకండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని ఆర్థిక నష్టం జరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
