online gaming scam| ఆన్‌లైన్‌ గేమింగ్.. రూ.5వేల కోట్ల సిండికేట్ గుట్టు రట్టు

హైదరాబాద్ జీఎస్టీ ఇాంటలిజెన్స్ విభాగం ఆల్ లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా అక్రమ దందా గుట్టు రట్టు చేసింది. రూ.5వేల కోట్ల విలువైన గేమింగ్‌ సిండికేట్‌పై దాడులు చేపట్టింది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ జీఎస్టీ ఇాంటలిజెన్స్ విభాగం ఆల్ లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా అక్రమ దందా గుట్టు రట్టు చేసింది. రూ.5వేల కోట్ల విలువైన గేమింగ్‌ సిండికేట్‌పై దాడులు చేపట్టింది. ముంబైకి చెందిన ఏసు ప్రభుకుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు.

ఇద్దరు నిందితులు దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని.. ఆన్‌లైన్‌ గేమింగ్ నిర్వహిస్తూ పెద్దమొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ సోదాలు కొనసాగిస్తుంది. జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీల వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Latest News