Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో స్వ‌ల్ప ఆటంకాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే సునాయాసంగా లక్ష్యాలను చేరుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎదురయ్యే ఆటంకాలు సహనంతో ఎదుర్కోవాలి. ఆటంకాలు అనుభవాలుగా మలచుకుంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. మానసికంగా సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీ ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వ్యాపారంలో ఒడుదొడుకులు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన ప్రతిపనిలోను ఆటంకాలు ఎదురవుతాయి. సందర్భానుసారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లక్ష్యంపై ఏకాగ్రత సడలకుండా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమంగా అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజుఅనుకూలంగా ఉంది. మీ సత్ప్రవర్తనతో, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది. డబ్బుకు లోటుండదు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా కళ, సాహిత్య రంగాల్లోని వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి పరంగా మీ నైపుణ్యం మీకు మంచి గుర్తింపునిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. మీ సమర్ధతలను పెంచుకుంటూ ముందుకెళ్లడం వలన విజయం సిద్ధిస్తుంది. కీలక వ్యవహారాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో ఉత్సాహంతో ముందుకు సాగితే లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబజీవితాన్ని ఈ రోజు సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రయాణం ఫలిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. వ్యాపారాలు తమ పోటీదారులతో అనవసరమైన చర్చలు, వాదనలకు దూరంగా ఉంటే మంచిది. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించడం వలన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక అనారోగ్య సమస్యల కారణంగా నిరాశ నిస్పృహలతో ఉంటారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తే అనుకున్నది సాధించగలరు. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. భవిష్యత్తు పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండడం అవసరం. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు.

Latest News