Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఊహించ‌ని ఆర్థిక ల‌బ్ధి..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వ్యాపారంలో పురోగతి ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా నూతన అవకాశాలు మెరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట మీ మృదువైన మాటలతో, ముక్కుసూటి మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వృత్తిరీత్యా కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించడానికి సమయం పట్టవచ్చు. సహనంతో ఉండండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుకునే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సమయస్ఫూర్తి, చాకచక్యంతో వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక సమావేశాల్లో చక్కగా రాణిస్తారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన రాజయోగం గోచరిస్తోంది. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లక్ష్మీకటాక్షంతో ధనసంపదలు పెరుగుతాయి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. డబ్బును మితంగా ఖర్చు చేయండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఈ రోజు ఊహించని ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఏ పని ప్రారంభించినా విజయం వెన్నంటే ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రతిభను ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. మానసిక ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. బుద్ధిబలంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గ్రహ గతులు అనుకూలంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. సినీ, మీడియా, కళారంగంలో వారికి ఈ రోజు అన్నివిధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది.

Latest News