Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో విజయం పొందాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో మంచి సమయం గడుపుతారు. ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన వృత్తి పరమైన ఆందోళన, ఒత్తిళ్లు తొలగిపోతాయి. దృఢ సంకల్పంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. అవసరానికి సరిపడా ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలతలు క్రమంగా తొలగుతాయి. ముందుచూపుతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మాట్లాడేటప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకుని మాట్లాడడం మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా అనేక కీలక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక క్రమ పద్దతిలో సాగితే విజయావకాశాలు మెరుగవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి అదృష్టం కూడా తోడవడంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో వరుస విజయాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. అధికారులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి గౌరవం పెరుగుతాయి. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి. ఆర్థికంగా లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యక్రమాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో చేసే ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సరైన సమయంలో సహకారం అందడంతో అన్ని పనులు సకాలంలో సజావుగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు పెడచెవిన పెట్టడం వలన ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారులకు నూతన అవకాశాలు లభించడంతో వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు మెరుగు పడతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. పలు మార్గాల నుంచి ఆర్థిక లాభాలతో ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలతతో అన్ని రంగాల వారు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram