మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిపథంలో పయనిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నప్పటికీ పెరిగే ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో శాంతంతో మెలగాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఒత్తిడి దరి చేరకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువుల నుంచి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్ఠమైన మంచి కాలం నడుస్తోంది. మీ ఆశయాలు, కర్తవ్యాలు అన్ని నెరవేరుతాయి. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష పదాల కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనం పాటించండి. వ్యాపారంలోనూ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎవరితోనూ ఘర్షణ పడకండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అందరినీ కలుపుకుని పోవడం వలన లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఒక ఘటన విచారం కలిగిస్తుంది. ఉద్యోగులు అధికారులతో వినయంగా నడుచుకోవాలి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధించాలంటే బాగా కష్టపడాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. కీలక నిర్ణయాలు అనుభవంతో తీసుకోవాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేయవచ్చు కాబట్టి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో శుభవార్తలు వింటారు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
