01.06.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 1, 2024 / 06:58 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు పూర్తి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజును చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకుంటారు. ఎనలేని శక్తితో అన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్యం కారణంగా విచారంగా ఉంటారు. ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. మంచి లాభాలను గడిస్తారు. స్థిరాస్తి రంగం వారికి ఈ రోజు ఫలవంతం అవుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. వృత్తి నిపుణులు, వ్యాపారులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఒక సంఘటన బాధ కలిగించవచ్చు.

కన్య

కన్యారాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారులు నష్టాలను చవి చూస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. సంతానం వైఖరి పట్ల ఆందోళనతో ఉంటారు. ఆశించిన మేర ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో అదృష్టం వరిస్తుంది. స్థిరాస్తి వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదనలకు దారితీసే చర్చలకు దూరంగా ఉండండి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు శుభఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు మెరుగవుతాయి. చేపట్టిన ప్రతిపనిలోను విజయం లభిస్తుంది.

Latest News