Site icon vidhaatha

Horoscope | మే 1, గురువారం రాశి ఫ‌లాలు.. ఈ రాశుల వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృతిపరంగా దూరప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు ఆశించిన మేరకు ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఘర్షణలు, వివాదాలకు పోకుండా మౌనంగా, ప్రశాంతంగా ఉండటం అవసరం. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళం, అనిశ్చిత కారణంగా మంచి అవకాశాలు కోల్పోవచ్చు. కుటుంబ సభ్యులతో రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరకపోవడం వల్ల గందరగోళంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, వెంచర్లు ప్రారంభించడానికి శుభ సమయం. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు పొందుతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే! వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతులు, ఆదాయ వృద్ది వంటి ప్రయోజనాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పితృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంది. వృత్తినిపుణులు, ఉద్యోగస్థులకు తోటి ఉద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆరంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోండి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తారాబలం అంత అనుకూలంగా లేనందున కొత్త కార్యక్రమాలు చేపట్టకండి. కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతంగా ఉండాలి. తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారెవరో గుర్తించాలి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇంటా బయటా కఠినమైన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త పడండి. డబ్బు నష్టపోయే ప్రమాదముంది.

Exit mobile version