మేషం
మేషరాశి వారికి ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ ఎనర్జిటిక్ గా ఉంటారు కాబట్టి అన్ని పనులూ అత్యుత్సాహంతో ముగిస్తారు. కుటుంబ సభ్యులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ఆర్ధిక లబ్ధితో లాభపడతారు. స్నేహితులతో, బంధువులతో సరదాగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ఆనందమయంగా ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. సంయమనం పాటించండి. అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, నిగ్రహం పాటించాలి. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యం వద్దు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. మొహమాటంతో చిక్కుల్లో పడే ప్రమాదముంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ధనలాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలున్నా లక్ష్యసాధనలో వెనుకంజ వేయకుండా ముందుకెళ్తారు. దైవబలం కాపాడుతుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లారు. వ్యాపారంలో పోటీ కారణంగా నష్టాలు ఉంటాయి. ఓ సంఘటన నిరుత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. స్థానచలనం ఉండవచ్చు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
తుల
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పదోన్నతులు పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధించడంతో పూర్తిగా ఆనందంగా ఉంటారు. వృత్తి పరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి తారా బలం చాలా బాగుంది. కొంతకాలంగా పీడించిన చెడు ప్రభావం తొలగింది. ఇంటా బయట వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యల నుంచి కోలుకుంటారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అపజయాలకు క్రుంగిపోవద్దు. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అవసరానికి సహాయం చేసే వారుంటారు.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన వస్త్ర లాభాలున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలలో అనుకూలత ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధి బలంతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్ధిక లాభాలు ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులు గణనీయమైన లాభాలు అందుకుంటారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓ సంఘటన సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. భూ, గృహ లాభాలున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి.