మేషం
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. వ్యాపారులు కలిసివచ్చే అవకాశాలతో కొత్త మైలురాయి సృష్టించుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు స్థానచలనం ఉండవచ్చు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ శక్తియుక్తులను ఒక్కచోటికి చేర్చి పనిచేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. యోగా, ధ్యానం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సాయపడతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఇంటికి అతిధుల రావడంతో పండగ వాతావరణం, సందడి నెలకొంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. కుటుంబ సభ్యులతో అందమైన ప్రదేశానికి విహారయాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగిపోతాయి. అనుకోని అవాంతరాలు వచ్చినా మనోబలాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో కృషిచేస్తే అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి ఈ పరిచయం దోహదపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్టు న్యాయ పరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది మీ ప్రతిభతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం వంటి పనులు చేయండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ రోజు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా గత కొంతకాలంగా పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుంది. భాగస్వాములు, సహోద్యోగులు సహకరిస్తారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిని కలుసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి అద్భుతమైన కానుకలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే పోటీని సామర్ధావంతంగా అధిగమిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. సీతారాముల ఆలయ సందర్శనం శుభప్రదం.