మేషం
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. చెడు విషయాల పట్ల ఆకర్షితులయ్యే ప్రమాదముంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలంతో పనిచేసి క్లిష్టమైన కార్యాన్ని సాధిస్తారు. అనుకోకుండా సంపదలు కలిసివస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పదోన్నతి వస్తుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు సరదాగా సాగిపోతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అన్ని రంగాల వారికి పనిలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలను అందుకుంటారు.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే గొడవలు ఉండవు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో బంధువులతో విరోధం ఏర్పడవచ్చు.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సవాళ్లు, ఆటంకాలను సహచరుల సహకారంతో అధిగమిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా విరోధం ఏర్పడే ప్రమాదముంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
తుల
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ విషయాల పట్ల మొండి వైఖరి వీడి సహనంతో వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి సంపదలు సమకూరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆర్థికంగా శుభసమయం నడుస్తోంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కీలక ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సమస్యల పట్ల మీ స్పందన అందరినీ బాధిస్తుంది. అవసరానికి ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులపై అధికారులతో వ్యహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడకపోతే ప్రమాదంలో పడతారు. ఆటంకాలను అధిగమించడంలో విఫలమవుతారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. శత్రుభయం ఉంది.