మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే మంచిది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. .శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూరదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విదేశీ వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్ధిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అవసరానికి ధనసహాయం అందుతుంది. ప్రతికూల ఆలోచనలు, అపనమ్మకాలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల పట్ల పూర్తి బాధ్యతతో ఉంటారు. సానుకూల దృక్పథంతో సత్ఫలితాలు ఉంటాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తి, వారసత్వపు ఆస్తి సంబంధిత గొడవలు ఉండవచ్చు. ప్రయాణాలలో ప్రమాద సూచన ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. వీలయితే ప్రయాణాలు వాయిదా వేయండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవిచూస్తారు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కోపావేశాలకు దూరంగా శాంతంగా ఉండడం అలవరచుకోవాలి. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు ఎదురవుతాయి. కృషికి తగిన ఆదాయం అందుకుంటారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో ప్రగతిని సాధిస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఆర్థిక పరంగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధించాలంటే అదనపు కృషి అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు సమిష్టి నిర్ణయాలతో లాభాలబాట పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి, కార్యసిద్ధి ఉన్నాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఓ వ్యవహారంలో ఆర్ధిక లబ్ది పొందుతారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి శుభ సమయం నడుస్తోంది. ఈ శుభ సమయంలో ఏ పని చేసినా అనుకూలిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
కుంభం
కుంభరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. ప్రయత్నలోపం, ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కీలక నిర్ణయాలలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గ్రహబలం సరిగా లేనందున ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.