Site icon vidhaatha

ఏప్రిల్ 3 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆర్థికంగా శుభ‌యోగాలు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. వ్యాపారులు కలిసివచ్చే అవకాశాలతో కొత్త మైలురాయి సృష్టించుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ఆలస్యం కారణంగా చికాకుతో ఉంటారు. ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా చక్కని ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడి, ఉద్రిక్తత కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. ఘర్షణల్లో మౌనంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటినీ అధిగమిస్తారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గత కొంత కాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉన్నాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో శుభయోగాలున్నాయి. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఆర్థికంగా శుభయోగం ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలున్నాయి. విమర్శకుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. కుటుంబ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పట్టుదలతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సంపద వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఓ ఘటన ఒత్తిడి కలిగిస్తుంది. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతత కలిగిస్తుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో స్థిరంగా ఉండడం మంచిది. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సృజనాత్మకంగా అలోచించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Exit mobile version