Site icon vidhaatha

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఆనందంగా ఈ రాశివారి వైవాహిక జీవితం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఎటువంటి ఆందోళనలు, ఆటంకాలు లేని ప్రశాంతమైన రోజు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు నూతన బాధ్యతలు ఒత్తిడి పెంచుతాయి. సమయ పాలన, క్రమశిక్షణతో ఒత్తిడి దూరమవుతుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థిక లాభాలున్నాయి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో మంచి సమయం గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా మారుతాయి. ఉద్యోగుల అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. నిరుత్సాహాన్ని, నిరాశావాదాన్ని దూరంగా ఉంచితే మంచిది. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది.

సింహం (Leo)

సింహరాశి వారికి మీరు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి అడుగేయాలి. సంపద వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఖర్చులు పెరుగుతాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాహన ప్రమాదాలకు అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆస్తి వ్యవహారాలతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ పరోపకారం, మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. కుటుంబ కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు పూర్తి ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో కావలసినంత ఆదాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా ఈ రోజు గొప్పగా ఉంటుంది. కుటుంబంలో ఆప్యాయత, సంతోషం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ముందుచూపుతో వ్యవహరించి ఆర్థికంగా విశేష లాభాలు అందుకుంటారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఆనందం కలిగిస్తుంది. పెద్దల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

 

Exit mobile version