Site icon vidhaatha

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి పెళ్లి కుదిరే అవ‌కాశం ఉంది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో వినయంగా ఉండాలి. ఉద్యోగులకు, వ్యాపారులకు కృషికి తగిన ధనలాభాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో మెలిగితే మంచిది. అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన లాభం సూచన ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఇంటా బయట వివాదాలు తావు లేకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కోపం అదుపులో ఉంచుకోవాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు చక్కగా కలిసి వస్తుంది. నూతన పెట్టుబడులు అందుతాయి. పితృ వర్గం నుంచి ఆర్థికలబ్ధి ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో అద్భుతాలు సాధిస్తారు. చేపట్టిన అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలతలు తొలగిపోతాయి. చేపట్టిన పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయట ఎటు చూసినా ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలకు దిగవద్దు. ఇతరుల మనసు నొప్పించేలా మాట్లాడవద్దు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. తీరికలేని పనుల నుంచి కొంత విరామం తీసుకుని స్నేహితులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతం గా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. సహోద్యోగులు సహకారంతో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరగడం సంతోషం కలిగిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. సందర్భానుసారం నడుచుకుంటే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్ట భయం ఉంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ కలహాలు ఆందోళన కలిగిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకుంటే మంచిది. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక సమావేశాలు, చర్చలలో రాణిస్తారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వ్యాపారులు సమిష్టి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. లాభాలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు.

Exit mobile version