Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి స‌న్నిహితుల‌తో గొడ‌వ‌లు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలకు పదోన్నతులు ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. మానసిక ఆనందం కలిగే అనేక సంఘటనలు జరుగుతాయి. వృత్తి పరంగా ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలున్నాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాల కోసం శ్రమించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా కూడా ఈ రోజు శుభకరమైన రోజు కాదు. అప్పులు, ఖర్చులు పెరిగే అవకాశముంది. కుటుంబసభ్యులతో, సన్నిహితులతో గొడవ పడతారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శుభ సమయం. వ్యాపారులు ఈ రోజు చేసుకునే ఒప్పందాలు, పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ప్రతిభకు కీర్తి, గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మంచి నైపుణ్యంతో చేపట్టిన పనిలో గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా బలపడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు పూర్తిగా తగ్గించుకోండి. ప్రియమైన వారితో అపోహలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో పరిస్థితి కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణం ఫలిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పోటీదారులతో అనవసరమైన చర్చలు, వాదనలకు దూరంగా ఉండండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. ఒత్తిడికి లోనుకావద్దు. కీలక వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయండి. కుటుంబంలో సమస్యలు, గొడవలు రాకుండా జాగ్రత్త పడండి.